ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లకు అస్వస్థత
అంటిగ్వా: వెస్టిండీస్, పాకిస్థాన్ మహిళల టీ20 మ్యాచ్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పాక్తో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్లో విండీస్ మహిళా క్రికెటర్లు చినెల్లీ హెన్రీ, చెడీన్ నేషన్ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలడం సహచర క్రికెటర్లను కలవరపాటుకు గురిచేసింది. పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది జరిగింది. వెంటనే స్పందించిన టీమ్ మేనేజ్మెంట్ క్రికెటర్లను దవాఖానకు తరలించింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని సీడబ్ల్యూఐ పేర్కొంది.