AUS vs SCO : టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు చేరిన ఆస్ట్రేలియా (Australia) చివరి లీగ్ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. సంచలనాలకు తావివ్వకుండా స్కాట్లాండ్ (Scottland)పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ ఛేదనలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(68), ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్(59)లు అర్ధ శతకాలతో స్కాటిష్ బౌలర్లను ఉతికారేశారు. వీళ్లిద్దరూ దంచేయడంతో మిచెల్ మార్ష్ సేన మరో రెండు బంతులు ఉండగానే జయకేతనం ఎగురవేసింది. ఈ విక్టరీతో మెగా టోర్నీ రెండో రౌండ్‌కు ముందు కంగారు జట్టు కొండంత ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకుంది.
సూపర్ 8 బెర్తును నిర్ణయించే మ్యాచ్ కావడంతో స్కాట్లాండ్ బ్యాటర్లు శివమెత్తారు. ఓపెనర్ మున్నే(35) రాణించగా. ఆ తర్వాత బ్రాండన్ మెక్కల్లమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 34 బంతుల్లోనే 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 60 రన్స్ బాదేశాడు.
The fastest Men’s #T20WorldCup fifty by a Scottish player 🏴
Brandon McMullen creates history with a special @MyIndusIndBank Milestone. #AUSvSCO pic.twitter.com/djsLOpCaN1
— ICC (@ICC) June 16, 2024
అతడిచ్చిన ఊపుతో కెప్టెన్ బెర్రింగ్టన్(42), వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్(18)లు ఆఖర్లో దంచేశారు. దాంతో స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 రన్స్ కొట్టింది. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 2 పరుగుల వద్దే ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(1) ఔటయ్యాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే మిచెల్ మార్ష్(8), విధ్వంసక ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(11)లు పెవిలియన్ చేరారు. 60 పరుగులకే 3 వికెట్లు పడిన దశలో హెడ్(60), స్టోయినిస్(59)లు ఇన్నింగ్స్ నిలబెట్టారు.
Turning the tide in Australia’s favour 🌊
Marcus Stoinis is awarded the @aramco POTM for his game-changing 59 from 29 balls 🏅 #T20WorldCup #AUSvSCO pic.twitter.com/X7mREQqyIq
— ICC (@ICC) June 16, 2024
తమదైన శైలిలో బౌండరీలు బాదుతూ అర్ధ శతకాలు సాధించి ఆస్ట్రేలియాను గెలుపు బాట పట్టించారు. స్టోయినిస్ వెనుదిరిగాక.. టిమ్ డేవిడ్(24 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వకుండా ఆసీస్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.