IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18వ సీజన్లోనూ చెలరేగి ఆడుతోంది. తొలి పోరులోనూ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. సొంతమైదానమైన ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు అభిషేక్ శర్మ(24), ట్రావిస్ హెడ్(46 నాటౌట్)లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. గత సీజన్ ఫామ్ కొనసాగించిన ఈ ఇద్దరు తొలి ఓవర్ నుంచే దంచేశారు. దాంతో, 3 ఓవర్లకే స్కోర్ 45 దాటింది. ఆభిషేక్ ఔటయ్యాక మరింత జోరు పెంచిన హెడ్ 6 ఓవర్లకు స్కోర్ 90 దాటించాడు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పిన్నర్ థీక్షణకు బంతి ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో అభిషేక్ కవర్స్‌లో భారీ షాట్ ఆడగా.. అక్కడే కాచుకొని ఉన్న యశస్వీ జైశ్వాల్ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. 45 పరుగుల వద్ద తొలి వికెట్‌గా అభిషేక్‌ను వెనుదిరిగాడు. దాంతో, రాజస్థాన్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
An action-packed start! 🔥
Travis Head and Abhishek Sharma got Sunrisers Hyderabad off to a flying start before Maheesh Theekshana broke the opening partnership 💪#SRH are 55/1 after 4 overs.
Updates ▶️ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR | @SunRisers |… pic.twitter.com/VWArfoyXnl
— IndianPremierLeague (@IPL) March 23, 2025
అయితే హెడ్ జతగా ఇషాన్ కిషన్(20) సైతం వేగంగా ఆడాడు. రెండు బౌండరీలతో తన జోరు చూపించగా.. జోఫ్రా ఆర్చర్ వేసిన 5వ ఓవర్లో హెడ్ శివాలెత్తిపోయాడు. వరుసగా 4, 6, 4.. ఆఖరి రెండు బంతుల్ని సైతం ఫోర్లుగా మలిచాడు. ఇక థీక్షణ బౌలింగ్‌లో ఇషాన్ , హెడ్ తలా రెండేసి ఫోర్లు బాదారు. దాంతో.. ఆరెంజ్ ఆర్మీ జట్టు పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 94 రన్స్ కొట్టింది.