చెన్నై: భారత నంబర్ వన్ చెస్ ప్లేయర్, తెలంగాణ కుర్రాడు ఇరిగేశి అర్జున్.. ప్రపంచ చాంపియన్ డి. గుకేశ్‌కు షాకిచ్చి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. సోమవారం జరిగిన ఐదో రౌండ్లో నల్లపావులతో ఆడుతూ అద్భుతమైన ఎత్తులు వేసిన అర్జున్ 63 ఎత్తుల్లో గుకేశ్‌కు చెక్ పెట్టాడు.
మరో రెండు రౌండ్లు మిగిలున్న టోర్నీలో 3.5 పాయింట్లతో ఫ్రాన్స్ జీఎం అలీరెజా ఫిరౌజతో కలిసి సంయుక్తంగా టాప్‌లో నిలిచాడు.