INDvsAUS: నెక్స్ట్ షమీ అతడే: టీమిండియా యువ పేసర్‌పై అశ్విన్ ప్రశంసలు
INDvsAUS: భారత జట్టులో సిరాజ్, ప్రసిధ్ కృష్ణ వంటి యువ పేసర్లు ఉన్నా షమీ తర్వాత అతడి స్థానాన్ని భర్తీ చేసేది మాత్రం..
INDvsAUS: టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్‌పై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపంచాడు. టీమిండియా స్టార్ పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌ల గైర్హాజరీతో యువ భారత్ బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచిన అతడికి చాలా భవిష్యత్ ఉందని కొనియాడాడు. భారత జట్టులో సిరాజ్, ప్రసిధ్ కృష్ణ వంటి యువ పేసర్లు ఉన్నా షమీ తర్వాత అతడి స్థానాన్ని భర్తీ చేసేది మాత్రం ముఖేషే అని అన్నాడు. వెస్టిండీస్ పర్యటనతో పాటు ఇటీవలే ఆస్ట్రేలియాతో విశాఖపట్నం వేదికగా ముగిసిన తొలి టీ20లో అతడు రాణించడంతో అశ్విన్ ముఖేష్‌పై ప్రశంసలు కురిపించాడు.
తన యూట్యూబ్ ఛానెల్లో అశ్విన్ మాట్లాడుతూ.. “గతంలో నేను మహ్మద్ సిరాజ్ నెక్స్ట్ షమీ అవుతాడని భావించాను. కానీ ముఖేష్ కుమార్‌ను చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. టీమిండియాలో అతడే జూనియర్ షమీ. అతడిని నేను లాలా అని పిలుస్తాను. షమీ మాదిరిగానే ముఖేష్‌లో కూడా అవే లక్షణాలున్నాయి. అతడి ఎత్తు, రిస్ట్ పొజిషన్, బంతిని స్వింగ్ చేసే విధానం అన్నీ షమీని పోలి ఉంటాయి. వెస్టిండీస్ సిరీస్‌లో అతడు చాలాబాగా బౌలింగ్ చేశాడు..” అని చెప్పుకొచ్చాడు.
ఇండియా-వెస్టిండీస్ మధ్య విశాఖపట్నం వేదికగా ముగిసిన తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్లు 10.20, 12.50 ఎకానమీతో బౌలింగ్ చేశారు. కానీ ముఖేష్ మాత్రం నాలుగు ఓవర్లు వేసి 29 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేసిన విషయం విదితమే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

