Gurukula Teacher | కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల ఆర్ట్ టీచర్ ఆడెపు రజనీకాంత్ తన కళా నైపుణ్యంతో అగ్గిపుల్లపై వరల్డ్ కప్‌ను ఆవిష్కరించాడు. అగ్గిపుల్ల, చాక్‌పీస్, పెన్సిల్ గ్రాపైట్పై అతి చిన్న పరిమాణంలో వీటిని చెక్కాడు. అగ్గిపుల్లపై 7 మి.మీ ఎత్తు, 2 మి.మీ వెడల్పుతో, చాక్‌పీస్‌పై 2.9 సెం.మీ ఎత్తు, 1 సెం.మీ వెడల్పుతో, పెన్సిల్ గ్రాఫిట్పై అతి చిన్న పరిమాణంలో 6 మి.మీ ఎత్తు, 2 మి.మీ వెడల్పు ఉన్న వరల్డ్ కప్‌ను సుమారు 5 గం.ల పాటు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు.
గతంలో సబ్బు, చాక్పీస్లపై అనేక కళాఖండాలను సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ పోటీలలో భారత్ వరల్డ్ కప్ సాధించాలని ఆకాంక్షతో వీటిని రూపొందించినట్లు తెలిపారు. పలువురు రజనీకాంత్ నైపుణ్యాన్ని అభినందించారు.