హైదరాబాద్: భారత మాజీ మహిళా క్రికెటర్ ఎస్కే శ్రావంతి నాయుడుకు రూ.3లక్షలు మంజూరు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్ణయించింది. శ్రావంతి తల్లిదండ్రులకు కరోనా సోకడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న హెచ్‌సీఏ శ్రావంతి తల్లిదండ్రుల చికిత్స కోసం ఆర్థికసాయాన్ని ప్రకటించింది. మా నాన్న ఐసీయూలో ఉండగా, అమ్మ పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరూ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. తక్షణమే స్పందించి సహాయాన్ని ప్రకటించిన హెచ్‌సీఏకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని శ్రావంతి పేర్కొంది. శ్రావంతి 11 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అందులో ఒక టెస్ట్, నాలుగు వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.
We will do our bit as well. Our team will be in touch with her. Thank you Jwala. https://t.co/PpgGHDdjcp
— Hanuma vihari (@Hanumavihari) May 17, 2021