హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు భారీ నజరానా దక్కింది. ఏడేండ్ల తర్వాత బుచ్చిబాబు టైటిల్ దక్కించుకున్న హైదరాబాద్ టీమ్‌కు రూ.25 లక్షల నజరానా అందిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు శుక్రవారం ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్లేయర్లను అభినందించిన ఆయన మాట్లాడుతూ ‘బుచ్చిబాబు టోర్నీలో హైదరాబాద్ విజేతగా నిలువడం చాలా సంతోషంగా ఉంది. గత సీజన్లో రంజీ ప్లేట్ చాంపియన్‌షిప్ దక్కించుకుంది. రానున్న సీజన్లో ఎలైట్ టైటిల్ లక్ష్యంగా ఎంచుకున్నాం. క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి అన్ని రకాలుగా హెచ్‌సీఏ మద్దతిస్తుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్, హెచ్‌సీఏ కౌన్సిల్ సభ్యులు దేవరాజ్, దల్జీత్‌సింగ్, బసవరాజు, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.