IPL 2025 : భారీ ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద షాక్. తన మొదటి ఓవర్లోనే హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీసి సీఎస్కేను దెబ్బకొట్టాడు. మొదట ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(5)ను.. ఆఖరి బంతికి రుతురాజ్ గైక్వాడ్ (0)ను డగౌట్‌కు చేర్చాడు. దాంతో, 8 పరుగులకే ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఓపెనర్ రచిన్ రవీంద్ర(4) దీపఖ్ హుడా(4) క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లకు స్కోర్.. 13-2.
చెపాక్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ కొట్టింది. కెప్టెన్ రజత్ పాటిదార్(51) సూపర్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పాటిదార్ విరాట్ కోహ్లీ(31)తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(32), టిమ్ డేవిడ్(22)లు ధానధన్ ఆడారు. సామ్ కరన్ వేసిన 20వ ఓవర్లో టిమ్ డేవిడ్ రెచ్చిపోయాడు. వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో ఆర్సీబీ స్కోర్ 190 దాటింది. నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. టర్నింగ్ పిచ్ మీద ఇది కొండంత లక్ష్యమే. అయితే.. తమకు అచ్చొచ్చిన మైదానంలో మరోసారి ఆర్సీబీకి చెన్నై జట్టు చెక్ పెడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
A perfect start by the bowlers ✌
2️⃣ quick wickets in no time for @RCBTweets 🔥
Updates ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB pic.twitter.com/wBYJkIAxdx
— IndianPremierLeague (@IPL) March 28, 2025