న్యూఢిల్లీ : భారత్‌తో ఏకైక టెస్టు, మూడు వనేల్డ సిరీస్ కోసం మంగళవారం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. రెండు ఫార్మాట్లలో అఫ్గాన్ జట్టుకు హష్మతుల్లా షాహిది సారథ్యం వహించనున్నాడు. న్యూ చండీగఢ్ వేదికగా వచ్చే నెల 6 నుంచి మొదలయ్యే టెస్టు కోసం ఆఫ్గన్ జట్టు రహమత్‌షా, రహ్మనుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్ లాంటి అనుభవజ్ఞులతో కనిపిస్తున్నది.
వీరికి తోడు వికెట్ కీపర్లు అఫ్సర్ జజాయ్, ఇక్రామ్, షరాఫుద్దీన్ అషఫ్,్ర క్వాయిస్ అహ్మద్ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు వన్డే జట్టులో రషీద్‌ఖాన్, రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహిం జద్రాన్ బరిలోకి దిగనున్నారు.