IPL 2025 : వరుసగా రెండో మ్యాచ్‌లో భారీ ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) పీకల్లోతు కష్టాల్లో పడింది. సిక్సర్లతో విరుచుకుపడే శివం దూబే(18)ని హసరంగ ఔట్ చేశాడు. మిడాన్ దిశగా దూబే కొట్టిన బంతిని రియాన్ పరాగ్ గాల్లోకి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అంతే.. 72 వద్ద సీఎస్కే మూడో వికెట్ల కోల్పోయింది. విజయ్ శంకర్ క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులతో ఆడుతున్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 73-3.
రాజస్థాన్ నిర్దేశించిన 183 పరుగుల ఛేదనలో సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. డేంజరస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(0)ను జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. తెలివిగా ఆఫ్ స్టంప్ అవతల బంతులు వేసి.. ఫామ్‌లో ఉన్న అతడి వికెట్ సాధించాడు డీ ఇంగ్లండ్ పేసర్ కీపర్ జురెల్ అధ్బుతంగా క్యాచ్ అందుకోవడంతో ఆర్చర్ గాల్లోకి ఎగిరి సంబురాలు చేసుకున్నాడు. మరో ఎండ్ నుంచి తుషార్ దేశ్పాండ్ సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 3 ఓవర్లలో ఒక్క బౌండరీ రాలేదు. తొలి ఓవర్ నుంచి తడబడిన రాహుల్ త్రిపాఠిని గూగ్లీతో బోల్తా కొట్టించాడు హసరంగ. దాంతో, 46 వద్ద సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి గేర్ మార్చిన రుతురాజ్ గైక్వాడ్.. 6వ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే.. పవర్ ప్లే తర్వాత సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(23)ను వనిందు హసరంగ పెవిలియన్ పంపాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన శివం దూబే(8).. అదే ఓవర్లో సిక్సర్‌తో జట్టు స్కోర్ 50 దాటించాడు.
𝙍𝙤𝙮𝙖𝙡 𝙒𝙞𝙡𝙙𝙛𝙞𝙧𝙚 🔥
Wanindu Hasaranga breaks the partnership to put #RR back on 🔝
Updates ▶️ https://t.co/V2QijpWpGO#TATAIPL | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/qs3HcKM4NH
— IndianPremierLeague (@IPL) March 30, 2025
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. నితీశ్ రానా(81 36 బంతులలో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ శతకంతో చెలరేగగా చెన్నై సూపర్ కింగ్స్ ముందు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలర్లపై అర్థ శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రానా శనివారం స్వీప్ షాట్లతో రెచ్చిపోయాడు. స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. సంజూ శాంసన్(20)తో 82 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడీ లెఫ్ట్ హ్యాండర్. మిడిలార్డర్ విఫలమైనా.. కెప్టెన్ రియాన్ పరాగ్(37) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో షిమ్రన్ హిట్మైర్(19) మెరుపులతో ప్రత్యర్థికి రాజస్థాన్ 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.