Asia Cup : యూఏఈ వేదికగా సెప్టెంబర్‌లో జరుగబోయే ఆసియా కప్ కోసం శ్రీలంక (Srilanka) సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. చరిత అసలంక (Charith Asalanka) సారథిగా 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరమైన స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా (Wanindu Asaranga) బెర్తు దక్కించుకున్నాడు. దుషాన్ హేమంత స్థానంలో ఈ మిస్టరీ బౌలర్‌ను తీసుకున్నారు సెలెక్టర్లు. అయితే.. ఈమధ్యే బంగ్లాదేశ్ సిరీస్‌లో ఆడిన నలుగురిని తప్పించడమే కాకుండా వెటరన్ ఎంజెలో మాథ్యూస్‌ను సైతం పక్కనపెట్టేశారు.
ఆల్‌రౌండర్ హసరంగ ఎంపికతో శ్రీలంక స్పిన్ దళం బలోపేతంగా మారింది. అయితే.. గాయం నుంచి కోలుకుంటున్న అతడు మెగా టోర్నీలోపు ఫిట్నెస్ సాధిస్తాడనే ఆశాభావంతో ఉంది అసలంక సేన. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన జట్టులోని అవిష్క ఫెర్నాండో, దినేశ్ చండీమాల్, జెఫ్రీ వాండర్సే, ఇషాన్ మలింగపై సెలెక్టర్లు వేటు వేశారు. వీళ్ల స్థానంలో నువనిందు ఫెర్నాండో, కమిల్ మిషారా.. పేసర్ దుష్మంత్ చమీర, చమిక కరుణరత్నే స్క్వాడ్‌లోకి వచ్చారు.
Sri Lanka has announced a 16-member squad for the upcoming Asia Cup in UAE 🇱🇰#AsiaCup2025 #AsiaCup #SriLanka pic.twitter.com/PdEZ3Jr7IY
— Circle of Cricket (@circleofcricket) August 28, 2025
శ్రీలంక స్క్వాడ్ : చరిత అసలంక(కెప్టెన్), పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, నువనిందు ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిషారా, దసున్ శనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే, మహీశ్ థీక్షణ, దుష్మంత చమీర, బినురా ఫెర్నాండో, నువాన్ తుషార, మథీశ పథిరన.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ మొదలవ్వనుంది. పదిహేనో సీజన్ ఛాంపియన్ అయిన శ్రీలంక ప్రారంభ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను సెప్టెంబర్ 13న ఢీకొట్టనుంది. సెప్టెంబర్ 15న హాంకాంగ్‌తో, సెప్టెంబర్ 18న అఫ్గనిస్థాన్‌తో లంక తలపడనుంది.