పూణె: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి ఎదురైంది. సోమవారం పూణెలో జరిగిన మ్యాచ్ టైటాన్స్.. 25-46తో హర్యానా స్టీలర్స్ చేతిలో పరాభవం పాలైంది. హర్యానా తరఫున శివమ్ పటారె (12), వినయ్ (7) మెరిశారు.
టైటాన్స్ నుంచి ఆశిష్ (13) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో హర్యానా అగ్రస్థానంలో కొనసాగుతుండగా తెలుగు టైటాన్స్ ఆరో స్థానంలో ఉంది.