టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు తృటిలో పతకాన్ని మిస్ చేసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో బ్రిటన్ చేతిలో ఇండియా ఓడిన విషయం తెలిసిందే. మహిళల హాకీ జట్టు ప్రదర్శనను ఎన్నటికీ మరువలేమని మోదీ అన్నారు. మ్యాచ్ ఆద్యంతం అత్యుత్తమ ఆటను ప్రదర్శించారని, జట్టులోని ప్రతి ప్లేయర్ అద్భుతమైన ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు. భారత జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందన్నారు. తృటిలో మహిళల హాకీ జట్టు మెడల్‌ను మిస్సైనట్లు ఆయన తన ట్వీట్లో చెప్పారు.
We will always remember the great performance of our Women’s Hockey Team at #Tokyo2020. They gave their best throughout. Each and every member of the team is blessed with remarkable courage, skill and resilience. India is proud of this outstanding team.
— Narendra Modi (@narendramodi) August 6, 2021
భారత హాకీ జట్టులో ఉన్న మహిళా ప్లేయర్లకు హర్యానా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ప్రస్తుతం టోక్యోకు వెళ్లిన హాకీ జట్టులో 9 మంది హర్యానా అమ్మాయిలే ఉన్నారు. అయితే ప్రతి ప్లేయర్‌కు 50 లక్షల క్యాష్ అవార్డు ఇవ్వనున్నట్లు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు.
Haryana Government will award Rs 50 lakhs each to the nine members of the Olympics women's hockey team who are from Haryana. I congratulate the Indian team for their praiseworthy performance at the Tokyo Olympics.
— Manohar Lal (@mlkhattar) August 6, 2021