డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. తైక్వాండ్‌లో రాష్ట్ర యువ ప్లేయర్ పాయం హర్షప్రద రజత పతకంతో మెరిసింది. మహిళల 73కిలోల కేటగిరీలో హర్షప్రద సత్తాచాటి రెండో స్థానంలో నిలిచింది. శుక్రవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో హర్షప్రద 0-2 తేడాతో చండీగఢ్‌కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఉత్తరాఖండ్ ప్లేయర్‌పై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. జాతీయ క్రీడల్లో పతకం సాధించిన హర్షప్రదను సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్‌గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.