Irani Cup : రంజీ ట్రోఫీ ఛాంపియన్ విదర్భ (Vidarbha) తమ జోరును చూపిస్తూ ఇరానీ కప్(Irani Cup) నూ పట్టేసింది. బ్యాటర్లతో పాటు స్పిన్నర్ దూబే చెలరేగడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా(ROI)కు షాకిస్తూ మూడోసారి ట్రోఫీని అందుకుంది. 2018, 2019లో ఇరానీ కప్ విజేత అయిన విదర్భ ఈసారి కూడా ఛాంపియన్‌గా నిలిచింది. దూబే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిని కూల్చడంతో 93 పరుగుల తేడాతో గెలుపొందింది. శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అథర్వ తైడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
విదర్భ నిర్దేశించిన 361 పరుగుల ఛేదనలో రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. 35/2తో ఐదో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ జట్టు ఐదో ఓవర్లోనే కెప్టెన్ రజత్ పాటిదార్ వికెట్ కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లు సైతం త్వరగా వెనుదిరగడంతో 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది రెస్ట్ ఆఫ్ ఇండియా. అనంతరం యశ్ ధుల్(92), సరాన్ష్ జైన్(29)లు ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించింది ఆదుకున్నారు.
𝐕𝐢𝐝𝐚𝐫𝐛𝐡𝐚 𝐚𝐫𝐞 𝐭𝐡𝐞 𝐈𝐫𝐚𝐧𝐢 𝐂𝐮𝐩 𝐰𝐢𝐧𝐧𝐞𝐫𝐬! 🙌
Harsh Dubey takes the final important wicket as Vidarbha win by 93 runs 💪
A superb all round performance 👏@IDFCFIRSTBank | #IraniCup pic.twitter.com/A610fmTkYR
— BCCI Domestic (@BCCIdomestic) October 5, 2025
కానీ, జైన్ ఎల్బీగా ఔట్ కావడంతో 156/6తో లంచ్‌కు వెళ్లింది రెస్ట్ ఆఫ్ ఆండియా. ఆ తర్వాత మానవ్ సుతార్ (56), ధుల్ ద్వయం 103 పరుగుల భాగస్వామ్యలో విదర్భను భయపెట్టారు. కానీ,సెంచరీకి చేరువైన ధుల్‌ను, అన్షుల్ కంబోజ్ను యశ్ ఠాకూర్ ఔట్ చేయడంతో ఆ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. టీ బ్రేక్ లోపే రెస్ట్ ఆఫ్ ఇండియాను 267కు ఆలౌట్ చేసిన విదర్భ హ్యాట్రిక్ ట్రోఫీతో చరిత్ర సృష్టించింది.
2018 ✅ 2019 ✅ 2025 🏅
The Hat-trick of Glory! 👑Vidarbha lift their third Irani Cup title, defeating Rest of India by 93 runs in Nagpur.
📸-JioHotstar pic.twitter.com/0LuW5TuZsC
— CricTracker (@Cricketracker) October 5, 2025
నాగ్ఫూర్లోని వీసీఏ స్టేడియంలో విదర్భ బౌలర్ల ధాటికి రెస్ట్ ఆఫ్ ఇండియా కుప్పకూలింది. తొలి వికెట్‌కు 52 పరుగుల శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. కెప్టెన్ రజత్ పాటిదార్(66), అభిమన్యు ఈశ్వరన్(52)లు రాణించగా.. యశ్ ఠాకూర్ విజృంభణతో ఆ జట్టు214కే ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో అథర్వ తైడే(143) మారథాన్ ఆటతో ఆదుకోగా.. యశ్ రాథోడ్(91) మెరవగా విదర్భ 312 రన్స్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ (3-51), సరన్ష్ జైన్(2-94)లు రాణించారు.