Harry Brook | ఐదు బంతుల్లో 21 రన్స్.. ఒంటిచేత్తో ఇంగ్లండ్‌ను గెలిపించిన బ్రూక్.. వీడియో
Harry Brook : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్ మినీ వేలానికి రెండు రోజుల ముందు ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ (Harry Brook) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ గడ్డపై జరిగిన మూడో టీ20లో బ్రూక్(30 నాటౌట్)...
Harry Brook : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్ మినీ వేలానికి రెండు రోజుల ముందు ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ (Harry Brook) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ గడ్డపై జరిగిన మూడో టీ20లో బ్రూక్(30 నాటౌట్) రఫ్పాడించాడు. ఆఖరి ఓవర్లో 21 పరుగులు బాది జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కేవలం 7 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సర్లతో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
విండీస్ నిర్దేశించిన 223 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌కు ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే ఒక వికెట్ తీసిన ఆండ్రూ రస్సెల్ బంతి అందుకున్నాడు. దాంతో, ఇప్పటివరకూ పెద్దగా రాణించని బ్రూక్ ఏం చేస్తాడు? అని అందరిలో ఉత్కంఠ.
𝗧𝗵𝗲 𝗛𝗜𝗚𝗛𝗘𝗦𝗧 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀𝗳𝘂𝗹 𝗿𝘂𝗻 𝗰𝗵𝗮𝘀𝗲 𝗮𝗴𝗮𝗶𝗻𝘀𝘁 𝘁𝗵𝗲 𝗪𝗲𝘀𝘁 𝗜𝗻𝗱𝗶𝗲𝘀! 🏏
Just watch this final over… Harry Brook take a bow! 👏#WIvENG pic.twitter.com/raErDRlvTZ
— Cricket on TNT Sports (@cricketontnt) December 16, 2023
కానీ, ఆ ఓవర్లో బ్రూక్ వీరకొట్టుడు కొట్టాడు. తొలి బంతికి ఫోర్ బాదిన బ్రూక్.. ఆ తర్వాత బాల్‌ను లెగ్‌సైడ్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. ఇక మూడో బంతిని ఫైన్ లెగ్ దిశగా సిక్సర్‌గా మలిచాడు. నాలుగో బంతికి 2 రన్స్ వచ్చాయంతే. దాంతో, అనూహ్యంగా ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. ఇంకా కావాల్సింది ఆరు పరుగులే. రస్సెల్ వేసిన ఐదో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ వెంటనే ఇంగ్లండ్ డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి.
హ్యారీ బ్రూక్

ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలానికి రెండు రోజుల ముందే బ్రూక్ సంచలన ఇన్నింగ్స్ ఆడడం విశేషం. నిరుడు వేలంలో ఈ స్టార్ బ్యాటర్ రూ.13.25 కోట్లు కొల్లగొట్లాడు. వేలానికి ముందు పాకిస్థాన్ గడ్డపై సెంచరీలతో మెరిసిన అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) కొన్నది. అయితే.. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)పై సెంచరీ తప్పితే టోర్నీ ఆసాంతం బ్రూక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతో, అతడిని హైదరాబాద్ వదిలించుకుంది. అందుకని బ్రూక్ ఈసారి రూ.2 కోట్ల కనీస ధరకు మినీ వేలంలో తన పేరు రిజిష్టర్ చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
- Kanguva | వచ్చే సమ్మర్లో కంగువ రిలీజ్ లేనట్టే.. సూర్య టీం నయా అప్డేట్ ఇదే..!
- Sajjan Jindal | హైకోర్టు జోక్యంతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై లైంగిక వేధింపుల కేసు
- Covid JN.1 | కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఆరోగ్యమంత్రి వీణా జార్జ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

