Covid JN.1 | కేరళలో కొత్తగా వెలుగు చూసిన కొవిడ్-19 జేఎన్.1 వేరియంట్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అన్నారు. ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) సాధారణ నిఘాలో వేరియంట్ బయటపడిందని చెప్పారు. మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇదో సబ్ వేరియంట్ అని.. ఇప్పుడే గుర్తించామన్నారు. రెండు మూడు నెలల కిందట సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయులకు పరీక్షలు నిర్వహించిన సమయంలో ఈ వేరియంట్ బయటపడిందని అన్నారు.
ఈ వేరియంట్ భారత్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఉందని.. కేరళ దాన్ని గుర్తించిందన్నారు. కేరళ రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ చాలా బాగుందన్న మంత్రి.. వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించలమన్నారు. కొమొర్బిడిటీలతో బాధపడుతున్న జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కొవిడ్ జేఎన్.1 వేరియంట్‌ను డిసెంబర్ 8న తిరువనంతపురం జిల్లాలోని కరకుళంలో ఆర్టీపీసీఆర్ పాజిటివ్ కేసులో వేరియంట్‌ను గుర్తించినట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ తెలిపారు. 79 సంవత్సరాల మహిళ నవంబర్ 18న ఆర్టీ పీసీఆర్ టెస్టులో పాజిటివ్‌గా తేలిందన్నారు. మహిళకు ఇన్ఫ్లుయెంజా తాలుకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత కొవిడ్ నుంచి కోలుకుందని చెప్పారు.