దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ వచ్చేశాయి. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(Harry Brook ) ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు. జో రూట్‌ను అతను వెనక్కి నెట్టేశాడు. ఇక బౌలింగ్‌లో ఇండియన్ పేసర్ బుమ్రా నెంబర్ వన్ స్పాట్లోనే ఉన్నాడు. ఆల్‌రౌండర్ పాత్రలో రవీంద్ర జడేజా టాప్‌లో ఉన్నాడు. 25 ఏళ్ల బ్రూక్ టెస్టుల్లో 8వ సెంచరీ నమోదు చేశాడు. వెల్లింగ్టన్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తాజాగా అతను సెంచరీ చేశాడు. ఒక్క పాయింట్ తేడాతో రూట్ కన్నా బ్రూక్ మెరుగయ్యాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బ్రూక్‌కు 898 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. జూలై నుంచి బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రూట్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. కేన్ విలియమ్సన్‌ను దాటేస్తూ అతను ఆ స్థానానికి వచ్చాడు.
టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. 890 రేటింగ్ పాయింట్లతో అతను టాప్‌లో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబడా 856 పాయింట్లతో బుమ్రాకు పోటీ ఇస్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ అన్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకుల్లో రవీంద్ర జడేజా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 415 రేటింగ్ పాయింట్లతో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మెహిది హజన్ మీర్జా రెండో స్థానంలో ఉన్నాడు
Joe Root’s reign is over 😮
A new World No.1 has been crowned in the ICC Men’s Test Batting Rankings 🏅 https://t.co/4r1ozlrWSA
— ICC (@ICC) December 11, 2024