WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తులే కాదు ఆరెంజ్ క్యాప్(Orange Cap), పర్పుల్ క్యాప్(Purple Cap) రేసు కూడా ఉత్కంఠ రేపుతోంది. ఈ సీజన్లో అత్యధిక పరుగులతో, అత్యధిక వికెట్లతో మ్యాచ్ విన్నర్లుగా అవతరించిన స్టార్లు ఎవరంటే.. ముంబై ఇండియన్స్‌ను రెండుసార్లు విజేగా నిలిపిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)240 రన్స్‌తో పోటీలో ఉంది. పర్పుల్ క్యాప్ రేసులో సోఫీ డెవినె (Sophie Devine) అగ్రస్థానంలో ఉంది. డబ్ల్యూపీల్ చరిత్రలో నాలుగో హ్యాట్రిక్ తీసిన నందినీ శర్మ (Nandni Sharma) 10 వికెట్లతో పోటీలో నిలిచింది.
ఆరంభంలో తడబడిన ముంబైని విజయాల బాట పట్టించిన హర్మన్‌ప్రీత్ ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడుతోంది. ఆరు మ్యాచుల్లో రెండు అర్ధ శతకాలు బాదిన ముంబై సారథి 60.00 సగటు, 143.871 స్ట్రయిక్ రేటుతో రెండో స్థానంలో కొనసాగుతోంది. వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో భారత్‌పై సెంచరీతో మెరిసిన ఆస్ట్రేలియా అమ్మాయి ఫొబే లిచ్‌ఫీల్డ్ (Phobe Litchfiled) అగ్రస్థానంలో ఉంది.
Cricket idol 🏏
Favourite shot 💥
Go-to Indian cheat meal 😋Catch #PhoebeLitchfield in a fun Q&A session! 🤩
After two unlucky early blows to @UPWarriorz, will she guide the team to an all-important win? 👀#TATAWPL #GGvUPW 👉 LIVE NOW ➡️ https://t.co/wF62OPcFlq pic.twitter.com/nDiSASRW8s
— Star Sports (@StarSportsIndia) January 22, 2026
యూపీ వారియర్స్ విజయాల్లో కీలకం అవుతున్న ఈ చిచ్చరపిడుగు.. ఆరు మ్యాచుల్లో 243 పరుగులతో టాప్‌లో ఉంది. ముంబై ఇండియన్స్‌కే చెందిన నాట్ సీవర్ బ్రంట్.. 219 రన్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ హిట్టర్ లిజెల్లీ లీ మూడు హాఫ్ సెంచరీలతో కలిపి 213 పరుగులతో నాలుగో ప్లేస్‌లో ఉండగా.. యూపీ సారథి మేగ్ లానింగ్ 207 రన్స్‌తో ఐదో స్థానం సాధించింది.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు లభించే పర్పుల్ క్యాప్ రేసులో కూడా పోటీ తీవ్రంగా ఉంది. నాలుగో సీజన్లో హ్యాట్రిక్‌తో చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ నందినీ శర్మ 10 వికెట్లతో గట్టి పోటీనిస్తోంది. అయిటే.. గుజరాత్ జెయింట్స్ ఆల్‌రౌండర్ సోఫీ డెవినె 11 వికెట్లతో నంబర్ 1 ర్యాంక్‌లో ఉంది. అయితే.. రెండో స్థానంలో ఉన్న నలుగురూ 10 వికెట్లు తీయడం విశేషం.
𝐇𝐚𝐭-𝐭𝐫𝐢𝐜𝐤 𝐇𝐞𝐫𝐨𝐢𝐜𝐬 💫
Shared with loved ones right by her side 💙
🎥 Watch Nandni Sharma’s special #TATAWPL moment 🙌 – By @ameyatilak #KhelEmotionKa | #DCvGG | @DelhiCapitals pic.twitter.com/PrlPxpUNMc
— Women’s Premier League (WPL) (@wplt20) January 12, 2026
ఆర్సీబీ సంచలనం నడినే డీక్లెర్క్, ముంబై స్టార్ అమేలియా కేర్.. పదేసి వికెట్లతో పోటీలో నిలిచారు. ఈ సీజన్లో పవర్ ప్లే క్వీన్‌గా అవతరించిన లారెన్ బెల్ 5 మ్యాచుల్లో 9 వికెట్లతో ఐదో ర్యాంక్ సాధించింది. బౌలింగ్ సగటు విషయానికొస్తే ఆర్సీబీ పేసర్ సయాలీ సత్ఘరే 8.00తో అగ్రస్థానం దక్కించుకుంది. బెల్ 12.00తో రెండో స్థానంలో కొనసాగుతోంది.
Richa Ghosh is excited for the WPL 2026 playoffs. 😍#Cricket #RichaGhosh #RCB pic.twitter.com/lunXRyeXS3
— Sportskeeda (@Sportskeeda) January 23, 2026
డబ్ల్యూపీఎల్ అంటే.. ముంబై ఇండియన్స్‌దే హవా ఉండేది. కానీ, ఈసారి రాయల్ ఛాలెంజర్స్ జోరు చూపిస్తోంది. వరుసపెట్టి ప్రత్యర్థులను ఓడిస్తూ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. మిగతా బెర్తుల కోసం గట్టి పోటీ నెలకొంది. లీగ్ దశ 14 మ్యాచ్‌లు పూర్తికాగా.. పాయింట్ల పట్టికలో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్లతో, ఉత్కంఠ పోరాటాలతో అభిమానులను అలరిస్తున్న ఈ లీగ్‌లో స్మృతి మంధాన టీమ్ ఫైనల్ చేరడం పక్కా అనిపిస్తోంది.