MI vs GG : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 162 పరుగులు చేసింది. నిర్ణీత ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి పోరాడగలిగే స్కోర్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. నాలుగో వికెట్‌కు హర్మన్‌ప్రీత్, అమేలియా 29 బంతుల్లో 51 రన్స్ చేశారు. అయితే.. ధాటిగా ఆడుతున్న అమేలియా కేర్ (19)ను ఔట్ చేసిన తనూజ కన్వార్ గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆమె ఔటయ్యాక వెంటనే ఇసీ వాంగ్ వెనుదిరిగింది. దాంతో, 136 వద్ద ముంబై ఐదో వికెట్ పడింది.
ఆ తర్వాత ముంబై కెప్టెన్ గేర్ మార్చింది. సిక్స్, ఫోర్‌తో స్కోర్‌బోర్డు 150 దాటించింది. 19వ ఓవర్లో అష్ గార్డ్నర్ హ్యాట్రిక్‌పై నిలిచింది. వరుస బంతుల్లో హర్మన్‌ప్రీత్, అమన్‌జోత్ కౌర్‌లను ఔట్ చేసింది. కానీ, ఆఖరి బంతికి జింతిమని కతియా రెండు రన్స్ తీసింది. గుజరాత్ బౌలర్లలో అష్ గార్డ్నర్ మూడు వికెట్లు తీసింది. కిమ్ గార్త్, స్నేహ్ రానా, తనూజా కన్వార్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఓపెనర్లు ఈ మ్యాచ్‌లో శుభారంభం ఇవ్వలేకపోయారు. ఓపెనర్ హేలీ మాథ్యూస్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యింది. అష్ గార్డ్నర్ వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికి డంక్లెన్ క్యాచ్ పట్డడంతో హేలీ వెనుదిరిగింది. తొలి వికెట్ పడ్డాక.. యస్తికా భాటియా (44), నాట్ సీవర్ బ్రంట్ (36) ముంబైని ఆదుకున్నారు. వీళ్లు రెండో వికెట్‌కు 74 రన్స్ జోడించారు. హాఫ్ సెంచరీకి దగ్గర్లో యస్తిక రనౌట్ అయ్యి మూడో వికెట్‌గా వెనుదిరిగింది. అప్పటికి ముంబై స్కోర్.. 84.