Harmanpreet Kaur : బంగ్లాదేశ్‌తో ‘టై’గా ముగిసిన మూడో వన్డేలో టీమిండియా(Team India) స్కిప్పర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) వ్యవహరించిన తీరు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భారత కెప్టెన్ తీరును తప్పుపట్టిన మ్యాచ్ రెఫరీ మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానాతో పాటు నాలుగు డీమెరిట్ పాయింట్లు(Demerit Points) విధించారు. అయితే… సారథిగా ఎన్నో విజయాలు అందించిన హర్మన్‌ప్రీత్ కారణంగా జట్టుకు నష్టం వాటిల్లనుంది. ఆమెకు డీమెరిట్ పాయింట్లు కేటాయిస్తే.. ఆసియా గేమ్స్(Asian Games 2023)లో భారత జట్టుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అదెలాగంటే..?
హర్మన్‌ప్రీత్ ప్రవర్తన ఐసీసీ లెవల్-2 నింబంధన(Level -2 rule)ను ఉల్లంఘన కిందకు వస్తుంది. దాంతో.. ఆమెకు 4 డీమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ ఐసీసీ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు డీమెరిట్ పాయింట్లు కేటాయిస్తే ఆసియా క్రీడల్లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టే. ఐసీసీ నిబంధనల ప్రకారం 24 నెలల్లో ఒక ప్లేయర్ నాలుగు డీమెరిట్ పాయింట్లు ఎదుర్కొంటే వాళ్లపై నిషేధం ఉంటుంది. టెస్టు అయితే ఒక మ్యాచ్‌కు, వన్డేలు, టీ20లు అయితే రెండు మ్యాచ్‌లకు దూరం కావాల్సి వస్తుంది.
ఆసియా గేమ్స్(Asian Games 2023)లో భారత జట్టు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. టైటిలో పోరుకు ముందు భారత్ క్వార్టర్, సెమీ ఫైనల్స్‌లో ఆడాల్సి ఉంది. అయితే.. డీమెరిట్ పాయింట్లు కేటాయిస్తే ఈ రెండు మ్యాచ్‌లకు హర్మన్‌ప్రీత్ దూరమవుతుంది. ఒకవేళ టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్‌కు మాత్రం ఆమె అందుబాటులో ఉంటుంది. ఫామ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ దూరమైతే ఆ ప్రభావం జట్టుపై భారీగానే ఉండే అవకాశం ఉంది.
మదన్ లాల్
మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ దూకుడు ప్రవర్తన జట్టుకు శాపంగా మారడంపై మాజీ ప్లేయర్లు విరుచుకుపడుతున్నారు. అంజుమ్ చోప్రా, మదన్‌లాల్(Madan Lal) వంటి వారు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తమకు అన్యాయం జరిగినప్పుడు దానిని వ్యక్తపరిచేందుకు బోల్డన్ని మార్గాలు ఉంటాయని, వాటిని కాదని ఇలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి హర్మన్ మైదానం వీడాల్సి వచ్చింది. తాను అవుట్ కాకున్నా అంపైర్ అవుటివ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన హర్మన్.. బ్యాట్‌తో స్టంప్స్‌ను ధ్వంసం చేసింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో అంపైర్లపై మాటల దాడితో విరుచుకుపడింది. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా(Nigar Sultana)తోనూ దురుసుగా ప్రవర్తించింది.
బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా, హర్మన్‌ప్రీత్
అక్కడతో ఆగలేదు సరికదా.. సిరీస్ ముగిసే సందర్భంగా తీసుకున్న ఫొటోషూట్లోనూ అంపైర్ల తీరును తప్పబట్టింది. ఇలా వరుసగా అంపైర్లపై దాడిని క్రికెట్ ప్రపంచం తీవ్రంగా పరిగణించింది. హర్మన్ ప్రవర్తనపై క్రికెట్ పండితులు, మాజీ ఆటగాళ్లు తీవ్రంగా స్పందించారు. తన ప్రవర్తనతో భారత క్రికెట్‌కు చెడ్డపేరు తీసుకొచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.