INDW VS AUSW : నాకౌట్ మ్యాచుల్లో తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చాటుకుంటోంది హర్మన్‌ప్రీత్ కౌర్(68 నాటౌట్). ఎనిమిదేళ్ల క్రితం ఆసీస్‌పై సెమీ ఫైనల్లో శతకంతో (171 రన్స్)తో రెచ్చిపోయిన కౌర్ ఈసారి కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడుతోంది. కూల్‌గా ఆడుతూ స్కోర్‌బోర్డును ఉరికిస్తున్న కౌర్ కెరీర్లో 21వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అంతేకాదు జెమీమా రోడ్రిగ్స్(82 నాటౌట్)తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పింది ఇండియన్ కెప్టెన్. వీరిద్దరూ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ.. బౌండరీలు రాబడుతూ స్కోర్ 200 దాటించారు.
ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఆస్ట్రేలియాను 338కే ఆలౌట్ చేసిన భారత జట్టు గొప్పగా పోరాడుతోంది. 59 పరుగులకే రెండు వికెట్లు పడినా జెమీమా రోడ్రిగ్స్(82 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(68నాటౌట్) ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. మూడో వికెట్‌కు 150 రన్స్ జోడించారిద్దరూ. దాంతో.. వరల్డ్ కప్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత ద్వయంగా రికార్డు సాధించారిద్దరూ. 2017 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మలు 137 రన్స్‌తో సృష్టించిన రికార్డును బ్రేక్ చేశారిద్దరు.
22nd ODI 5⃣0⃣ for the captain! 🫡
1⃣0⃣0⃣-run partnership 🙌Harmanpreet Kaur and Jemimah Rodrigues are wonderfully guiding #TeamIndia‘s chase 🔝
Updates ▶ https://t.co/ou9H5gN60l#WomenInBlue | #CWC25 | #INDvAUS | @ImHarmanpreet | @JemiRodrigues pic.twitter.com/Meo8jDbyyo
— BCCI Women (@BCCIWomen) October 30, 2025