Hockey Asia Cup : స్వదేశంలో జరుగుతున్న హాకీ ఆసియా కప్(Hockey Asia Cup)లో భారత జట్టు బోణీ కొట్టింది. ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా(China)కు షాకిస్తూ పాయింట్ల ఖాతా తెరిచింది టీమిండియా. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగగా ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. సారథి జోరుకు జుగురాజ్ సింగ్ గోల్ కూడా తోడవ్వడంతో 4-3తో మ్యాచ్‌ను ముగించిన టీమిండియా గ్రూప్ ఏ నుంచి అగ్రస్థానంలో నిలిచింది.
రాజ్‌గిర్ వేదికగా ప్రారంభమైన ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు అదిరే ఆటతో చైనాను మట్టికరిపించింది. గ్రూప్ దశలోని తొలి పోరులో ఆట మొదలైన కాసేపటికే ప్రత్యర్థి జట్టు తొలి గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయినా సరే ఒత్తిడికి లోనవ్వని భారత బృందం టాప్ గేర్‌లో ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చైనా డిఫెన్స్‌ను ఛేదిస్తూ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు.
𝗪𝗜𝗡 to begin! 🙌
India beat China in a closely contested match at the Hero Asia Cup, Rajgir, Bihar, 2025.
🇮🇳 4-3 🇨🇳#HockeyIndia #IndiaKaGame #HumSeHaiHockey #HeroAsiaCupRajgir pic.twitter.com/tEJbdlBUTT
— Hockey India (@TheHockeyIndia) August 29, 2025
చైనా ఆటగాళ్లు సైతం మరో రెండు గోల్స్ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఉత్కంఠ నెలకొన్న వేళ.. జుగ్రాజ్ సింగ్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంతో టీమిండియా ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఛాంపియన్‌గా నిలిస్తే ఈ ఏడాది జరుగబోయే ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ బెర్తు కైవసం చేసుకుంటుంది.