Hardik Pandya | ముంబైని వీడిన పాండ్యా.. బెంగళూరుకు మారడానికి కారణమిదే..!
Hardik Pandya : భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబైని వీడాడు. ఈమధ్య తరచూ గాయాలతో సతమతమవుతున్న పాండ్యా ఫిట్నెస్ కోసం బెంగళూరుకు మకాం మార్చాడు.
Hardik Pandya : భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబైని వీడాడు. ఈమధ్య తరచూ గాయాలతో సతమతమవుతున్న పాండ్యా ఫిట్నెస్ కోసం బెంగళూరుకు మకాం మార్చాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఈ డాషింగ్ బ్యాటర్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)ను తన శాశ్వత శిక్షణ కేంద్రంగా మార్చుకున్నాడు. తద్వారా ప్రస్తుతం బీసీసీఐ కాంట్రాక్టున్న వారిలో.. సీఓఈలో తప్పనిసరిగా ట్రైనింగ్ తీసుకోనున్న తొలి ఆటగాడు పాండ్యానే కావడం విశేషం.
గుజరాత్‌లోని బరోడాకు చెందిన హార్దిక్ పాండ్యా గత పదేళ్లుగా ముంబైలో ఉంటున్నాడు. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న పాండ్యా.. ఫ్రాంచైజీ శిక్షణ కేంద్ర ఘన్సోలీ(Ghansoli)లో గడిపేవాడు. కానీ, 19వ సీజన్ అనంతరం అతడిని వట్రేడ్ డీల్ ద్వారా వదులుకోవాలని ముంబై యాజమాన్యం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో తిరిగి భారత జట్టులో చోటే లక్ష్యంగా పెట్టుకున్న పాండ్యా ముంబై నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాడు.
🚨 REPORTS 🚨
Hardik Pandya has permanently relocated to Bengaluru to make the BCCI’s Centre of Excellence his primary training base. 🏠
He is looking to utilize the Centre of Excellence’s facilities for injury management and skill development for the remainder of his career.… pic.twitter.com/PAwJb4Ct3u
— Sportskeeda (@Sportskeeda) June 30, 2026
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్(ODI World Cup 2027) ఆడాలనుకుంటున్న ఈ ఆల్‌రౌండర్ ఫిట్నెస్ మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నుట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి.
‘హార్దిక్ పాండ్యా ఇదివరకే బెంగళూరుకు షిఫ్టయ్యాడు. సిటీ శివారులో.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు దగ్గర్లో ఒక భవంతిని అద్దెకు తీసుకున్నాడు. సీఓఈని శాశ్వత శిక్షణ కేంద్రంగా మలచుకున్న ఏకైక ఆటగాడు పాండ్యానే. ముంబైలోని ఇంటి నుంచి శిక్షణ కేంద్రానికి వెళ్లడం పాండ్యాకు ఇబ్బందిగా తోచింది. సెంట్రల్ కాంట్రాక్టున్న ఆటగాడు కాబట్టి అతడు సీఓఈలో ప్రతి సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు’ అని పీటీఐతో వెల్లడించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Baroda
- BCCI
- CoE
- hardik pandya
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

