Hardik Pandya : టీ20 వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఆసియా కప్(Asia Cup 2025) స్క్వాడ్‌లో చోటు దక్కించుకునేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. యూఏఈ వేదికగా జరుగబోయే ఈ టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో ఫిట్నెస్ టెస్టులో పాస్ అయ్యేందకు చెమటోడ్చుతున్నాడు పాండ్యా. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పాండ్యా తన ఫిట్‌నెస్‌కు మెరుగులు దిద్దుకోనున్నాడు. ఆగస్టు 11, ఆగస్టు 12.. రెండు రోజులు ఎన్సీఏలోని బృందం ఈ పేస్ ఆల్‌రౌండర్ పరీక్షలు నిర్వహించింది. అన్ని టెస్టుల్లోనూ సత్తా చాటితే ఆసియా కప్ ఎంపికకు పాండ్యా అందుబాటులో ఉండే అవకాశముంది.
టైమ్స్ ఆఫ్ ఇ ఇండియా కథనం ప్రకారం.. జూలై మధ్య నుంచే పాండ్యా ముంబైలో తన వర్కవుట్ రొటీన్‌ను షురూ చేశాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పోస్ట్ ద్వారా అభిమానులకు హింట్ ఇచ్చాడీ స్టార్ ప్లేయర్. ఎన్సీఏలో చిన్న ట్రిప్ ఉంది అని ఆదివారం ఒక క్యాప్షన్ పెట్టిన పాండ్యా.. తన పునరాగమనంపై అప్డేట్ ఇచ్చాడు. నిరుడు పొట్టి ప్రపంచ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు.
A short Bengaluru stop for Hardik Pandya at the NCA. pic.twitter.com/mDc51WngD6
— CricTracker (@Cricketracker) August 11, 2025
టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఆసియా కప్ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా మొదలవ్వనున్న ఈ టోర్నీకి స్క్వాడ్ ఎంపిక భారత సెలెక్టర్లకు సవాల్‌గా మారింది. ఎందుకుంటే.. జూన్‌లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న సూర్యయాదవ్ యాదవ్ (Suryakumar Yadav) కోలుకునే దశలో ఉన్నాడు. ఈ మిస్టర్ 360 సైతం ఫిట్నెస్ కోసం ఎన్సీఏలో చేరాడు. మ్యాచ్ విన్నర్ అయిన పాండ్యా సైతం ఫిట్నెస్ చాటుకోవాల్సి ఉంది. ఇద్దరూ కీలక ఆటగాళ్లు కావడంతో.. త్వరగా ఫిట్నెస్ నిరూపించుకోవాలని యావత్ క్రీడాలోకం కోరుకుంటోంది.