టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. జట్టులో పునరాగమనం తర్వాత అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా భవిష్యత్తులో జట్టు పగ్గాలు పట్టే సత్తా కూడా తనకుందని నిరూపించాడు. గాయంతో గత టీ20 ప్రపంచకప్ తర్వాత సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకొని ఆపై సత్తాచాటాడు. ఆ తర్వాత ఆడిన ప్రతి సిరీస్‌లోనూ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు.
ఈ క్రమంలోనే టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో పాండ్యా ర్యాంకు పైపైకి దూసుకొచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాటుతో, ఇటు బంతితో రాణించిన అతను.. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి దూసుకొచ్చాడు. ఇది పాండ్యా కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకింగ్ కావడం గమనార్హం.