IND vs BAN : సూపర్ 8 రెండో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికేశారు. సెమీస్ బెర్తును నిర్ణయించే పోరులో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) వీరబాదుడు బాదాడు. ఒకదశలో బంగ్లాదేశ్ పేసర్ తంజిమ్ షకీబ్ చెలరేగినా..టాపార్డర్‌లో విరాట్ కోహ్లీ(37), రిషభ్ పంత్(36)లు సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దాంతో, టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 రన్స్ కొట్టింది. తద్వారా రోహిత్ సేన మెగా టోర్నీలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
అంటిగ్వాలో టాస్ ఓడిన రోహిత్ శర్మ(23) జట్టుకు శుభారంభమిచ్చాడు. ధనాధన్ ఆడిన హిట్‌మ్యాన్ షకీబుల్ హసన్ బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్ బాదిన హిట్‌మ్యాన్ నాలుగో బంతిని అంచనా వేయలేక జకీర్ అలీ చేతికి చిక్కాడు. దాంతో, 39 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ పడింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(37), రిషభ్ పంత్(36)లు కీలక భాగస్వామ్యంతో రన్ రేట్ 6కు తగ్గకుండా చూశారు. ముస్తాఫిజర్ వేసిన ఆరో ఓవర్లో కోహ్లీ కళ్లు చెదిరే సిక్సర్ బాదగా.. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 53 రన్స్ కొట్టింది.

కోహ్లీ, పంత్‌ల దూకుడుతో దూసుకెళ్తున్న భారత స్కోర్ బోర్డకు తంజిమ్ హసన్ కళ్లెం వేశాడు. ఒకే ఓవర్లో కోహ్లీని బౌల్డ్ చేసిన హసన్.. మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్(6)ను వెనక్కి పంపాడు. అయినా సరే పంత్ జోరు తగ్గించలేదు. ఒంటిచేత్తో సిక్సర్ బాది స్కోర్ బోర్డును ఉరికించాడు. అయితే. 11.4 ఓవర్లో పంత్ ఔటయ్యాక స్కోర్ వేగం తగ్గింది. శివం దూబే(34), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐదో వికెట్‌కు 53 రన్స్ జోడించి జట్టు స్కోర్ 160 దాటించారు. అఖర్లో పాండ్యా సిక్సర్లతో మోతమోగించాడు. ముస్తాఫిజుర్ వేసిన 20వ ఓవర్లో 3 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించాడు. దాంతో, టీమిండియా ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
A quick fire half-century 🔥
Hardik Pandya brings up his @MyIndusIndBank Milestone in just 27 balls 💥#T20WorldCup #INDvBAN pic.twitter.com/ktN3dzFaRd
— ICC (@ICC) June 22, 2024