చంఢీఘడ్: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఎం భగవంత్‌మాన్ నేతృత్వంలోని పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ .. హర్భజన్‌ను రాజ్యసభకు నియమించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు జలంధర్‌లో కొత్తగా ఏర్పాటు చేయబోయే క్రీడా యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకి అప్పగించనున్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం మాన్ ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ వయసు 41 ఏళ్లు. అయితే రాజ్యసభకు నామినేట్ చేసే అంశం గురించి ఇటీవల హర్భజన్‌ను మాన్ కలిశారు. రాష్ట్రంలో క్రీడా ప్రమాణాలను అభివృద్ధి చేయాలని భజ్జీని భగవంత్ కోరారు. ప్రజలకు సేవ చేసేందుకు హర్భజన్ ఇంట్రెస్టింగ్ ఉన్నారని, ముఖ్యంగా క్రీడాకారులు అభివృద్ధి భజ్జీ కట్టుబడి ఉన్నట్లు గతంలో మాన్ తెలిపారు.