మాంచెస్టర్: పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న 24 ఏండ్ల హైదర్.. మాంచెస్టర్‌లో ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డట్టు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు తెలిపారు. గత నెల 23న లైంగిక దాడి ఘటన జరిగినట్టు వాళ్లు చెప్పారు.
ఈకేసులో హైదర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిని బెయిల్‌పై విడుదల చేశారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం హైదర్ ఏ నేరానికి పాల్పడ్డాడనే విషయాన్ని వెల్లడించలేదు. సెకండ్ టైర్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీ నిమిత్తం పాకిస్థాన్ షాహీన్స్ జట్టులో హైదర్ సభ్యుడిగా ఉన్నాడు. పాక్ తరఫున 2 వన్డేలు, 35 టీ20లు ఆడిన హైదర్.. ఆ దేశ టీ20 జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.