Dipa Karmakar : ఒలింపిక్‌లో కొద్దిలో పతకం చేజార్చుకున్న భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ (Dipa Karmakar) సంచలన నిర్ణయం తీసుకుంది. తనకెంతో ఇష్టమైన ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ (Artistic Gymanst) ఆటకు వీడ్కోలు పలికింది. 31 ఏండ్ల వయసున్న దీప సోమవారం తాను జిమ్నాస్ట్ క్రీడకు అల్విదా పలుకుతున్నట్టు వెల్లడిచింది. ఎక్స్ పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్న ఆమె ఏం చెప్పిందంటే..?
భారత్‌లో జిమ్నాస్ట్ అంటే మొదట గుర్తొచ్చే పేరు దీప కర్మాకర్. ఈశాన్య రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె ఈ ఆటలో ఎన్నో శిఖరాలు అధిరోహించింది. అంతర్జాతీయ, దేశ స్థాయి పోటీల్లో ఎన్నో మెడల్స్ కొల్లగొట్టింది. పారిస్ విశ్వక్రీడల్లో నాలుగో స్థానంతో పతకం చేజార్చుకున్న దీప ఒలింపిక్ పతకం ఒక్కటే లోటుగా 25 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు దీప వీడ్కోలు పలికింది. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ అంతర్జాతీయ వేదికలపై తలపడడం , మార్పులకు తన శరీరం సహరించకపోవడం వంటివి దీప వీడ్కోలు నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. మ్యాట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. నా సుదీర్ఘ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నా అని దీప ఓ పోస్ట్ పెట్టింది.
Signing off from the mat! ❤️
Thank you to everyone who has been a part of my journey.
Onto the next chapter🤸🏻♀️🙏🏻 pic.twitter.com/kW5KQZLr29— Dipa Karmakar (@DipaKarmakar) October 7, 2024
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకు చెందిన దీపా 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌తో వెలుగులోకి వచ్చింది. ప్రొడునోవ వాల్ట్‌లో అత్యధిక పాయింట్లు సాధించి కాంస్య పతకం గెలిచింది. దాంతో, ఆమె పేరు భారతీయ పత్రికల్లో, టీవీల్లో మారుమోగిపోయింది. ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన దీప 4 స్థానంలో నిలిచింది. వరల్డ్ కప్‌లో మెడల్ సాధించిన దీప మరోసారి భారత దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది.
భారత ఆశాకిరణంగా వెలుగొందుతున్న దీప ఈమధ్య తన కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. డోపింగ్ టెస్టులో పట్టుబడిన ఆమెపై అంతర్జాతీయ డ్రగ్స్ నిషేధ సంస్థ 21 నెలల నిషేధం విధించింది. అయితే.. ఇన్నేళ్లలో ఎన్నడూ కూడా నిషేధిత పదార్థాలను తీసుకోవాలనే ఆలోచనే తనకు రాలేదని, తనకు తెలిసింది జిమ్నాస్ట్ మాత్రమే దీప వాపోయింది. అంతేకాదు దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎప్పుడూ చేయను అని దీపా తన ట్వీట్టర్లో వెల్లడించింది.
‘2021 అక్టోబర్‌లో నా శాంపిల్‌ను తీసుకొని డోప్ టెస్టుకు పంపారు. హిగెనమినె – ఎస్3 బీటా -2 అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉండడంతో టెస్టులో పాజిటివ్ వచ్చింది. అసలు ఆ పదార్థం నా శరీరంలోకి ఎలా వచ్చిందో తెలియదు. అయితే.. అంతర్జాతీయ సమాఖ్య నా విషయంలో తొందరగా నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకంతో నేను ఈ నిషేధాన్ని అంగీకరిస్తున్నా. ఈ వ్యవహారం మొత్తం సహృదయ వాతావరణంలో జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది’ అని దీప రాసుకొచ్చింది. ఆఖరి సారిగా దీప సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ చాంపియన్‌షిప్స్(Senior National Championship)లో ఆమె పోటీ పడింది.