హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థ సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశంలోని పది నగరాలు సమాహారంగా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌నకు తెరతీసింది. తొలి దశ పోటీలు గువాహటి వేదికగా శుక్రవారం మొదలుకాగా, హైదరాబాద్‌లో అక్టోబర్ 19 నుంచి 23వ తేదీ వరకు పోటీలు జరుగనున్నాయి.
అండర్-9, 11, 13, 15, 17 వయసు విభాగాల్లో టోర్నీకి భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్‌శెట్టి మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘టోర్నీలో భాగం కావడం సంతోషంగా ఉంది. రికార్డు స్థాయిలో చాలా మంది పిల్లలు బ్యాడ్మింటన్ పట్ల ఆకర్షితులవుతున్నారు’ అని అన్నారు.