IND vs ENG : వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత పేసర్లు చెలరేగుతున్నారు. కుర్రాడు గుర్నూర్ బ్రార్(2-34) ధాటికి ఒకే ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లలు పెవిలియన్ చేరారు. దాదాపు మూడేళ్ల తర్వాత తొలి వన్డే ఆడుతున్న బుమ్రా(1-9) కూడా విజృంభించగా కెప్టెన్ హ్యారీ బ్రూక్(1) డగౌట్ చేరాడు. దాంతో.. చూస్తుండగానే ఆతిథ్య జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. జో రూట్(1), జోస్ బట్లర్(4) క్రీజులో ఉన్నారు.
ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి వన్డేల్లో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. పవర్ ప్లే వరకూ వికెట్ కాచుకున్న ఓపెనర్లు.. ఆ తర్వాత వికెట్ ఇచ్చేశారు. గుర్నూర్ బ్రార్(2-34) విజృంభణతో ఒకే ఓవర్లో జాకబ్ బెథెల్(14), బెన్ డకెట్(43) ఔటయ్యారు.
Both openers gone in one over 👏
Ben Duckett ❌
Jacob Bethell ❌#ENGvIND #GurnoorBrar #JacobBethell #Cricket pic.twitter.com/RipRM2w71B— CricketTimes.com (@CricketTimesHQ) July 14, 2026
రెండో బంతికి బెథెల్ వెనుదిరగగా.. నాలుగో బంతికి థర్డ్‌మ్యాన్ దిశగా డకెట్ సిక్సర్‌కు యత్నించగా.. బౌండరీ లైన్ వద్ద బుమ్రా ఒడుపుగా అందుకున్నాడు. దాంతో, 63 పరుగుల వద్ద ఆతిథ్య జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి బుమ్రా ఓవర్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్(1) స్లిప్‌లో రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. ప్రస్తుతం జో రూట్(1), జోస్ బట్లర్(4) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు స్కోర్.. 74–3.