Asian Championships : అసియా ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ బోణీ కొట్టింది. దక్షిణా కొరియాలోని గుమీ వేదికగా జరుగుతున్నఈ టోర్నమెంట్ తొలి రోజే అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్ (Gulveer Singh) స్వర్ణ పతకంతో మెరిశాడు. పురుషుల 10 వేల పరుగులో అగ్రస్థానంలో నిలిచిన గుల్వీర్ పసిడితో దేశం గర్వపడేలా చేశాడు. దాంతో, ఈ పోటీల్లో తొలి గోల్డ్ మెడల్ సాధించిన దేశంగా భారత్ నిలవగా.. స్వర్ణం గెలుపొందిన మూడో భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడీ అథ్లెట్.
ఇక 29 కిలోమీటర్ల రేస్ వాక్‌లో భారత అథ్లెట్ సెర్విన్ సెబాస్టియన్ (Servin Sebastian) కాంస్యంతో గర్జించాడు. నాలుగో స్థానంలో నిలిచిన సవాన్ బర్వాల్ కొద్దిలో పతకం చేజార్చుకున్నాడు. అయితే.. మహిళా అథ్లెట్లు మాత్రం విఫలమయ్యారు. ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలుపొందిన జావెలిన్ త్రోయర్ అన్ను రాణి (Annu Rani) నాలుగో స్థానంతో నిరాశపరిచింది.
Servin Sebastian wins the First Medal for India 🇮🇳
Servin clocked 1:21:13.60 to clinch the Bronze Medal in Men’s 20km Race Walk at 26th Asian Athletics Championship, Gumi 2025 🥉
Good start for India here, Well Done 🇮🇳👏 pic.twitter.com/Yg3rn6r7ha
— The Khel India (@TheKhelIndia) May 27, 2025
మంగళవారం ఆసియా ఛాంపియన్షిప్స్ ఆరంభం కాగా.. రేస్ వాకర్ సెర్విన్ సెబాస్టియన్ తొలి పతకం అందించాడు. గంట 21 నిమిషాల 13.60 సెకన్ల వ్యవధిలో లక్ష్యాన్ని చేరకున్న సెర్విన్ కంచు మోత మోగించాడు. అనంతరం జరిగిన 10 వేల మారథాన్‌లో గుల్వీర్ సింగ్ అలుపెరగకుండా పరుగెత్తి గోల్డ్ మెడల్ కొల్లగొట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో జాతీయ రికార్డు బద్ధలు కొట్టిన ఈ రన్నర్.. ఉత్కంఠ రేపిన ఫైనల్లో ప్రత్యర్థులకు షాకిచ్చాడు.
Just look at the acceleration in the last lap 🤯
– Very Well Done , Gulveer Singh 🇮🇳🥇pic.twitter.com/un6ym4m4MX https://t.co/8BcJr4g4qm
— The Khel India (@TheKhelIndia) May 27, 2025
తద్వారా ఈ టోర్నీ..10 వేల పరుగులో స్వర్ణం సాధించిన మూడో భారతీయుడిగా గుల్వీర్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు హరి చంద్(1975), జీ. లక్ష్మణన్(2017)లు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పసిడితో పోడియం మీద భారత పతాకాన్ని రెపరెపలాడించారు.