Shashtipoorthi | రూపేష్ , ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం షష్టిపూర్తి. ఈ సినిమాతో పవన్ ప్రభ దర్శకునిగా పరిచయమవుతుండగా సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ , అర్చన కీలక పాత్రల్లో నటించారు.. ‘మా ఆయి ప్రొడక్షన్స్‘ పతాకం పై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.ఈ మూవీ భైరవంకి పోటీగా మే 30న థియేటర్స్‌లోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, ట్రైలర్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుందని సినీ ప్రేక్షకులు విశ్వసిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో నటించిన ఓ సీనియర్ హీరోయిన్ ఛాలెంజింగ్ పాత్ర చేసి అందరిని ఆశ్చర్యపరిచంది. సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా చీరకట్టులో నటించినట్టు తెలిపి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఆమె ఎవరో కాదు అర్చన. ఈ అమ్మడి గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియక పోవచ్చు కానీ తెలుగు సినిమాల్లో క్లాసికల్ గా నిలిచిన సినిమాల్లో నిరీక్షణ చిత్రంలో నటించి అప్పటి సినీ ప్రియులని ఎంతగానో అలరించింది. అయితే నిరీక్షణ తర్వాత అర్చన వెండితెరపై కనిపించింది లేదు. కాని ఇప్పుడు షష్టిపూర్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సరసన నటిస్తుంది.
అయితే గత కొద్ది రోజులుగా షష్టిపూర్తి సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అర్చన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… నిరీక్షణకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. నిరీక్షణ సినిమాలో గిరిజన యువతి పాత్రలో నటించిన తాను ఆ పాత్రలో నటించేందుకు పెద్ద సాహసమే చేసింది అని చెప్పాలి. అప్పట్లో నేను చీరకట్టుకొని బ్లౌజ్ లేకుండా నటిస్తున్నా అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. నేను దర్శకుడిని నమ్మాను.. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కడా అశ్లీలత లేకపోవడంతో అతన్ని పూర్తిగా నమ్మి నటించాను అని అర్చన చెప్పుకొచ్చారు. నిరీక్షణ సినిమాకు బాలుమహేంద్రన్ దర్శకత్వం వహించగా, ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.