D Gukesh : చెస్ సంచలనంగా పేరొందిన భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ (D Gukesh) గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుపొందిన గుకేశ్ మెగా టోర్నీల్లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. స్విట్జరాండ్ వేదికగా జరుగుతున్న ఫిడే గ్రాండ్ స్విస్ (FIDE Grand Swiss) టోర్నమెంట్లో ఈ యంగ్‌స్టర్ ఏకంగా హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకున్నాడు. శుక్రవారం ఏడో రౌండ్ మ్యాచ్‌లో పదహారేళ్ల టర్కీ గ్రాండ్‌మాస్టర్ ఎడిజ్ గురెల్ (Ediz Gurel) చేతిలో గుకేశ్ కంగుతిన్నాడు.
ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో గుకేశ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్న ఈ యువకెరటం వరుసగా అభిమన్యు మిశ్రా(యూఎస్ఏ), నికోలస్ థీయోడరస్ (గ్రీస్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఏడో గేమ్‌లో ఆరంభం నుంచి గుకేశ్, గురెల్ పోటాపోటీగా ఆడారు. అయితే.. 27వ ఎత్తులో ఇద్దరూ పొరపాటు చేశారు. అనంతరం 29వ ఎత్తులో ఇరువురు రాణులను మార్చుకున్నారు.
The moment World Champion Gukesh resigned — his third loss in a row, this time against GM Ediz Gürel from Türkiye.
🇹🇷 Ediz Gürel 1–0 Gukesh D 🇮🇳
Round 7 | #FIDEGrandSwiss pic.twitter.com/MJ918pQGgk— International Chess Federation (@FIDE_chess) September 11, 2025
అప్పటివరకూ ఫోకస్‌గా ఆడిన గుకేశ్ 40వ ఎత్తులో పెద్ద తప్పిదంతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ చేజారగానే బాధను దిగమింగుకుంటూ ప్రత్యర్థికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు గుకేశ్. దాంతో, అతడి ఫామ్‌పై కామెంటేటర్లతో పాటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంతకూ గుకేశ్‌కు ఏమైంది. కచ్చితంగా ఆడుతున్నది అతడు కాదు’ అని మరుసే అష్లే(జమైకా, అమెరికా దిగ్గజం) ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం భారత స్టార్ ప్లేయర్ ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయంతే. ఇకపై టోర్నీలో ముందంజ వేయాలంటే తుదపరి అన్ని మ్యాచులు గెలిచితీరాల్సిందే.
🇳🇱 Anish Giri was spotted carefully following the opening between 🇭🇺 Richard Rapport and 🇮🇳 Praggnanandhaa.
🇮🇳 Divya Deshmukh and 🇮🇱 Boris Gelfand were just as curious!
❓ Do you also like to roam and check out other games after making your move?#FIDEGrandSwiss pic.twitter.com/zuAINOWgtt
— International Chess Federation (@FIDE_chess) September 12, 2025
గుకేశ్ వెనకంజలో ఉండగా.. భారత్‌కు చెందిన ప్రజ్ఞానంద, నిహాల్ సరిన్లు ప్రత్యర్థులకు చెక్ పెట్టి ఆశలు రేకెత్తిస్తున్నారు. పర్హం మగ్సూద్లో(ఇరాన్)ను ఓడించిన నిహల్ జర్మనీకి చందిన మ్యాటిహస్ బ్లుబౌమ్తో సంయుక్తంగా 5.5 పాయింట్లు సాధించాడు. ఇజ్రాయేల్ గ్రాండ్‌మాస్టర్ మాక్జిమ్ రొడ్షెటిన్ను నిలువరించిన ప్రజ్ఞానంద 4.5 పాయింట్లు సొంతం చేసుకున్నాడు.