సింగపూర్: ప్రతిష్ఠాత్మక చెస్ చాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య డ్రాల పరంపర కొనసాగుతున్నది. బుధవారం ఇద్దరి మధ్య జరిగిన 13వ గేమ్ డ్రాగా ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ లిరెన్‌పై గెలిచేందుకు గుకేశ్ ఆఖరి దాకా ప్రయత్నించినా లాభం లేకపోయింది.
లిరెన్‌ను నిలువరించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసిన గుకేశ్ విజయం సాధించలేక 68 ఎత్తుల్లో గేమ్‌ను డ్రా గా ముగించాడు. దీంతో ఇద్దరి స్కోరు ప్రస్తుతం 6.5-6.5 స్కోరుతో సమమైంది. ఆఖరి రౌండ్ విజేతను నిర్ణయించనుంది.