IPL 2024 CSK vs GT : ఐపీఎల్ 17వ సీజన్ ఏడో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్(CSK), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్లు తలపడున్నాయి. తొలి మ్యాచ్లో విజయంతో జోరు మీదున్న ఇరుజట్లు రెండో విజయంపై కన్నేశాయి. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ బౌలింగ్ తీసుకున్నాడు. గుజరాత్ ఏ మార్పులు లేకుండా ఆడుతుండగా.. చెన్నై ఒక మార్పు చేసింది. థీక్షణ స్థానంలో యార్కర్ కింగ్ పథిరన తుది జట్టులోకి వచ్చాడు.
సీఎస్కే తుది జట్టు : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్యా రహానే, సమీర్ రిజ్వీ, డారిల్ మిచెల్, శివం దూబే, జడేజా, ధోనీ(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, పథిరన, తుషార్ దేశ్పాండే.
గుజరాత్ తుది జట్టు: శుభ్మన్ గిల్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి కిశోర్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ. ఉమేశ్, జాన్సన్, ఒమర్జాయ్.
సబ్స్టిట్యూట్స్ : గుజరాత్ – సాయి సుదర్శన్, శరత్, అభినవ్ మనోహర్, నూర్ అహ్మద్, మానవ్ సుథార్.
సీఎస్కే – మథీశ పథిరన, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, మిచెల్ శాంట్నర్.