Viral Video : తాజా పండ్లు, ఫేవరెట్ స్వీట్స్ లేదా ఇష్టమైన రెసిపీ ఇలా ఏది చూసినా వెంటనే తినాలని అనిపిస్తుంటుంది. ఆ ఫ్లేవర్ మనల్ని వెంటాడుతూ ఆస్వాదించాలనే తపన పెరుగుతుంది. ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
ఈ వీడియోలో వ్లాగర్ ఫ్రిడ్జ్‌లో గ్రేప్స్‌తో కూడిన బౌల్‌ను ఉంచి డోర్ వేయబోతూ బౌల్ నుంచి ఓ గ్రేప్ను టేస్ట్ చేస్తాడు. ఆపై డోర్ వేయబోతూ మళ్లీ మూడు గ్రేప్స్‌ను టేస్ట్ చేసి డోర్ క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తూ మళ్లీ బౌల్ మొత్తం తీసుకుని తినేసేందుకు రెడీ అవుతాడు.
డిజిటల్ క్రియేటర్ @అవినాష్జీఎస్_అఫిషియల్ అనే అకౌంట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ రీల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా అప్లోడ్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా 9.6 కోట్ల మంది వీక్షించారు. నేను గ్రేప్స్ తింటూ ఈ రీల్‌ను వాచ్ చేశా అని ఓ యూజర్ కామెంట్ చేయగా ఇది నిజం అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు. చిప్స్‌తో కూడా ఇలాగే జరుగుతుందని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :