హైదరాబాద్: గుజరాత్ టేబుల్ టెన్నిస్ సూపర్ లీగ్‌లో తెలంగాణ యువ ప్లేయర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ సత్తాచాటాడు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ పోరులో స్నేహిత్ సారథ్యం వహించిన తప్తి టైగర్స్ జట్టు 132-101 తేడాతో షామల్ స్కాడ్పై గెలిచి సీజన్ తొలి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన తుది పోరులో స్నేహిత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సింగిల్స్‌తో పాటు పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో ప్రత్యర్థులపై విజయాలు సొంతం చేసుకున్నాడు. అరంగేట్రం సీజన్ టైటిల్ గెలువడంపై స్నేహిత్ స్పందిస్తూ ‘కెరీర్లో ఇది మరిచిపోలేని సందర్భం. జట్టును ముందుండి నడిపిస్తూ టైటిల్ విజేతగా నిలుపడంపై చాలా సంతోషంగా ఉంది. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాను’ అని అన్నాడు.