IPL 2025 : ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) అగ్రస్థానంపై కన్నేసింది. ప్రస్తుతం 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్ బృందం.. లీగ్ దశ చివరి రెండు మ్యాచుల్లోనూ విజయాలతో టాప్‌లో కొనసాగాలని భావిస్తోంది. ఈ నేపథ్యలోనే గురువారం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో తలపడుతోంది గుజరాత్.
తమ సొంత ఇలాకాలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గిల్ బౌలింగ్ తీసుకున్నాడు. నాకౌట్ పోరుకు దూసుకెళ్లలేని లక్నో.. బలమైన గుజరాత్‌కు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది. నామమాత్రమైన ఈ పోరులో గుజరాత్ ఎలాంటి మార్పులు లేకుండా ఆడనుంది. లక్నో జట్టులోకి పేసర్ ఆకాశ్ దీప్ వచ్చాడు.
🚨 Toss 🚨 @gujarat_titans won the toss and elected to field against @LucknowIPL #GT wearing a special jersey for a special cause tonight 🙌
Updates ▶️ https://t.co/NwAHcYJT2n #TATAIPL | #GTvLSG pic.twitter.com/byoukpW0wm
— IndianPremierLeague (@IPL) May 22, 2025
గుజరాత్ తుది జట్టు : శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫొర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిశోర్, కగిసో రబడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
లక్నో తుది జట్టు : మిచెల్ మార్ష్, ఎడెన్ మర్క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుశ్ బదొని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, విలియం ఓ రూర్కీ.