Nandini Rai | ఇటీవల కొందరు భామలు తమకి ఎదురైన విచిత్ర పరిస్థితుల గురించి సోషల్ మీడియాలోనో లేదంటే పలు ఇంటర్వ్యూలలోనో చెబుతూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తాజాగా నందిని రాయ్ తనకి సినిమా అవకాశాలు తగ్గడం పట్ల ఆసక్తికర కామెంట్స్ చేసింది. 2011లో సినీరంగంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ నందిని రాయ్. కెరీర్ ఆరంభంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ఈ అమ్మడు తెలుగుతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. కానీ అదృష్టం కలిసిరాలేదు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం అయినా కూడా ఆశించిన స్థాయి గుర్తింపు రాకపోవడంతో సోషల్ మీడియాని నమ్ముకుంది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలు మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఫోటోల స్థాయిలో వైరల్ అవుతూ ఉంటాయి.స్టార్ హీరోయిన్స్ తో పోల్చితే మరింత అందంగా ఉన్నా కూడా నందిని రాయ్ కి ఎందుకు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డం దక్కలేదని తన అభిమానులు బాధపడుతూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందిని రాయ్ గోవాలో తనకు ఎదురైన భయానక అనుభవం గురించి చెప్పి అందరు నోరెళ్లపెట్టేలా చేసింది. ఓ సారి గోవాకి తన ఫ్రెండ్స్‌తో వెళ్లింది నందిని రాయ్. ఆ సమయంలో తనపై చేతబడి జరిగిందని చెప్పుకొచ్చింది. 2017, 18 ఆ టైంలో నా కెరీర్ చాలా డల్ అయిపోవడంతో పాటు డిప్రెషన్‌కి వెళ్లాను. అప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం అయ్యేది కాదు. నేను నా ఫ్రెండ్స్ తో గోవాకు వెళ్లిన టైంలో ఓ నెగిటివ్ ఎనర్జీ నన్ను కమ్మేసింది.
గోవాలో ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్ వద్ద హ్యాపీగా గడుపుతున్న సమయంలో వాటర్‌లో ఓ క్లాత్ వచ్చి నా కాలికి చుట్టుకుంది. తీసి పడేసాను. మళ్లీ వచ్చి కాలికి తగలడంతో ఏంటా అని క్లాత్ విప్పి చూస్తే అందులో 2 బొమ్మలు, మహిళ జుట్టు, ఆ బొమ్మలకు సూదులు గుచ్చేసి ఉన్నాయి. ఎవరికో చేతబడి చేసినట్టు అర్ధమైంది. అయితే అలాంటివి ముట్టుకోకూకడదట. అది చూసి నాకు ఎంతో భయం వేసింది. అవి తీసి చూడడంతో నాలో మరింత భయం పెరిగిపోయింది అని నందినీ అన్నారు.ఆ ఘటన తర్వాత చాలా భయపడ్డాను. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి.ఆస్తమా లక్షణాలు కనిపించాయి. రేపు అనేది ఉంటుందా అనిపించింది. నా తర్వాత నా వాళ్లు ఏమైపోతారో అనే ఆలోచనలు వచ్చేసేవి. నెగెటివ్ ఎనర్జీ వలన నా కెరీర్లో సక్సెస్ కాలేకపోయానేమో. నెగెటివ్ ఎనర్జీ నుండి బయటపడడానికి రెండేళ్లు పట్టింది. ఆ టైంలో నేను ఏ సినిమా కూడా చేయలేకపోయాను అని నందిని పేర్కొంది.