IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans) తలపడుతున్నాయి. విజయంతో టోర్నీని ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. గుజరాత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, ట్రావిస్ హెడ్, వృద్దిమాన్ సాహాతో బ్యాటింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. గత సీజన్లో దంచి కొట్టిన డేవిడ్ మిల్లర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. బౌలింగ్‌లో షమీ, రషీద్ ఖాన్ చెలరేగితే చెన్నై జట్టుకు కష్టమే.
gujarat titans vs chennaisuper kings Live updates, CSK vs GT live updates, MS dhoni vs hardhik pandya
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (63) ఔటయ్యాడు. తుషార్ దేశ్పాండో ఓవర్లో సిక్స్ బాది, తర్వాతి బంతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో 138 రన్స్ వద్ద ఆ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా క్రీజులో ఉన్నారు. గుజరాత్ విజయానికి 30 బంతుల్లో 41 రన్స్ కావాలి.
గజరాత్ బిగ్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(8)ను జడేజా బౌల్డ్ చేశాడు. స్వీప్ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. 113 రన్స్ వద్ద ఆ జట్టు మూడో వికెట్ పడింది. అంతకుముందు ఓవర్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (51) హాఫ్ సెంచరీ బాదాడు. శాంటర్న్ ఓవర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సాహా ఔటయ్యాక సుదర్శన్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు
గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (38) హాఫ్ సెంచరీ బాదాడు. శాంటర్న్ ఓవర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సాహా ఔటయ్యాక సుదర్శన్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హార్దిక్ పాండ్యాతో మూడో వికెట్‌కు 18 రన్స్ జోడించాడు. వచ్చాడు. గుజరాత్ విజయానికి 51 బంతుల్లో 70 రన్స్ కావాలి.
End of Powerplay! @gujarat_titans are off to a quickfire start in the chase, moving to 65/1 👌 👌
Follow the match ▶️ https://t.co/61QLtsnj3J#TATAIPL | #GTvCSK pic.twitter.com/jvpShshKTt
— IndianPremierLeague (@IPL) March 31, 2023
గుజరాత్ కీలక వికెట్ కోల్పోయింది. ఇంప్యాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్(22) ఔటయ్యాడు. హంగర్గేకర్ ఓవర్లో ధోనీ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (38)తో కలిసి రెండో వికెట్‌కు 50 రన్స్ జోడించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (38), ఇంప్యాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్(22) రెండో వికెట్‌కు 50 రన్స్ జోడించారు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 9 ఓవర్లకు వికెట్ నష్టానికి గుజరాత్ 90 పరుగులు చేసింది. గుజరాత్ విజయానికి 65 బంతుల్లో 89 రన్స్ కావాలి.
ఇంప్యాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్(19) బౌండరీలతో హోరెత్తిస్తున్నాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (33) కూడా ధాటిగా ఆడుతున్నాడు. 8 ఓవర్లకు వికెట్ నష్టానికి గుజరాత్ 82 పరుగులు చేసింది. శాంటర్న్ బౌలింగ్‌లో సుదర్శన్, గిల్ తలా ఒక బౌండరీ కొట్టారు. గుజరాత్ విజయానికి 73 బంతుల్లో 98 రన్స్ కావాలి.
గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (21), ఇంప్యాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్(6) ఆచితూచి ఆడుతున్నారు. దేశ్‌పాండే ఓవర్లో గిల్ తొలి బంతిని కవర్ డ్రైవ్‌గా బౌండరీ బాదాడు. ఫ్రీ హిట్‌ను స్టాండ్స్‌లోకి పంపించాడు. దాంతో, ఆ ఓవర్లో 15 రన్స్ వచ్చాయి. 5 ఓవర్లకు వికెట్ నష్టానికి గుజరాత్ 56 పరుగులు చేసింది.
గుజరాత్ ఓపెనర్ వృద్దిమాన్ సాహా(25) ఔటయ్యాడు. హంగర్గేకర్ ఓవర్లో భారీ షాట్ ఆడాడు. శివం దూబే సూపర్ డైవింగ్ క్యాచ్ పట్టడంతో సాహా వెనుదిరిగాడు. దాంతో, 37 రన్స్ వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది. శుభ్‌మన్ గిల్ (9) క్రీజులో ఉన్నాడు.
గుజరాత్ ఓపెనర్ వృద్దిమాన్ సాహా(20) ధాటిగా ఆడుతున్నాడు. చాహర్ ఓవర్లో సిక్స్ బాదాడు. దాంతో, 3 ఓవర్లకు 29 రన్స్ చేసింది. శుభ్‌మన్ గిల్ 8 పరుగులతో ఆడుతున్నాడు.
రెండు ఓవర్లకు గుజరాత్ 18 రన్స్ చేసింది. దేశ్‌పాండే ఓవర్లో వృద్దిమాన్ సాహా(12) సిక్స్, బౌండరీ కొట్టాడు. శుభ్‌మన్ గిల్(6) కూడా మిడాన్ దిశగా ఫోర్ కొట్టడంతో రన్స్ వచ్చాయి.
సీఎస్కే ఏడో వికెట్ కోల్పోయింది. ఆది నుంచి తడబడుతున్న శివం దూబే(19) ఔటయ్యాడు. షమీ ఓవర్లో సిక్సర్ బాదిన అతను తర్వాతి బంతికి షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. అంతకుముందు జోసెఫ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా(1) ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద విజయ్ శంకర్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు.
సీఎస్కే మరో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా(1) ఔటయ్యాడు. అంతకుముందు ధాటిగా ఆడుతున్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92) సెంచరీకి ముందు ఔటయ్యాడు. అల్జారీ జోసెఫ్ ఓవర్లో శుభ్‌మన్ గిల్ అద్భుత క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ధోనీ, శివం దూబే(9) క్రీజులో ఉన్నారు.
సీఎస్కే కీలక వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92) సెంచరీకి ముందు ఔటయ్యాడు. అల్జారీ జోసెఫ్ ఓవర్లో శుభ్‌మన్ గిల్ అద్భుత క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. 152 రన్స్ వద్ద ఆ జట్టు ఐదో వికెట్ పడింది. రవీంద్ర జడేజా, శివం దూబే(9) క్రీజులో ఉన్నారు.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92) సెంచరీకి చేరువలో ఉన్నాడు. రషీద్ ఖాన్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ కొట్టాడు. దాంతో, రన్స్ వచ్చాయి. శివం దూబే(9) క్రీజులో ఉన్నారు. సీఎస్కే 17 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 151 రన్స్ చేసింది. అలిజారీ జోసెఫ్ షార్ట్ లెంగ్త్ బంతులతో కట్టడి చేశాడు. దాంతో, పరుగుల వేగం తగ్గింది.
సీఎస్కే 16 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 140 రన్స్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (82), శివం దూబే(9) క్రీజులో ఉన్నారు. అలిజారీ జోసెఫ్ షార్ట్ లెంగ్త్ బంతులతో కట్టడి చేశాడు. దాంతో, పరుగుల వేగం తగ్గింది.
15 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి సీఎస్కే 133 రన్స్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (80), శివం దూబే(4), క్రీజులో ఉన్నారు. హార్దిక్ వేసిన 15 ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. అంతకు ముందు అలిజారీ జోసెఫ్ ఓవర్లో నాలుగు రన్స్ వచ్చాయంతే.
అంబటి రాయుడు(11) ఔటయ్యాడు. లిటిల్ ఓవర్లో షాట్‌కు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. దాంతో, 121 రన్స్ వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (76) క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి సీఎస్కే 121 రన్స్ చేసింది. ఈ ఓవర్లో కేన్ విలియమ్సన్ అద్భుత ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను ఆపాడు. లిటిల్ ఓవర్లో గైక్వాడ్ కొట్టిన బంతిని అమాంతం గాల్లోకి ఎగిరి పట్టుకున్నాడు. బౌండరీ లైన్ అవతల పడేశాడు. కానీ, బంతి బౌండరీ చేరింది. జంప్ చేయడంతో అతను కాసేపు నొప్పితో విలవిలలాడాడు.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (70) విధ్వంసక బ్యాటింగ్‌తో గుజరాత్ టైటన్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. యశ్ దయాల్ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి సిక్సర్ బాదాడు. ఆఖరి బంతిని అంబటి రాయుడు(11) స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో 14 రన్స్ వచ్చాయి. 12 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి సీఎస్కే 114 రన్స్ చేసింది. అంతకుమందు లిటిల్ ఓవర్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి స్కోర్ వంద దాటించాడు.
రుతురాజ్ గైక్వాడ్(63) చెలరేగి ఆడుతున్నాడు. అర్ధ శతకం బాదిన అతను సిక్స్‌లతో విరుచుకుపడుతున్నాడు. లిటిల్ ఓవర్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి స్కోర్ వంద దాటించాడు. అంబటి రాయుడు (4) క్రీజులో ఉన్నాడు. బెన్ స్టోక్స్(7) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మోయిన్ అలీ (19) ని రషీద్ ఖాన్ పెవిలియన్ పంపాడు. 11 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి సీఎస్కే 100 రన్స్ చేసింది.
మోయిన్ అలీ (19) ధాటిగా ఆడుతున్నాడు. షమీ వేసిన ఐదో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు రాబట్టాడు. నాలుగో బంతికి ఫోర్ కొట్టిన అతను నాలుగో బంతికి స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ తర్వాత ఐదో బంతిని ఫోర్‌గా మలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 23 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు. ఐదు ఓవర్లకు వికెట్ నష్టానికి సీఎస్కే 46 రన్స్ చేసింది.
జోష్ లిటిల్ వేసిన నాలుగో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ 23) రెచ్చిపోయాడు. తొలి బంతికి భారీ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతిని బౌండరీకి తరలించాడు. మోయిన్ అలీ (4) ఐదో బంతిని ఫోర్‌గా మలిచాడు. దాంతో, నాలుగు ఓవర్లకు వికెట్ నష్టానికి సీఎస్కే 29 రన్స్ చేసింది. షమీ తన రెండో ఓవర్లో ఓపెనర్ డెవాన్ కాన్వే(1)ను బౌల్డ్ చేశాడు. షమీకి ఇది వందో వికెట్ కావడం విశేషం. ఆ ఓవర్లో ఒకే ఒక పరుగు వచ్చింది.
గుజరాత్ టైటన్స్ బౌలర్ షమీ బిగ్ వికెట్ తీశాడు. సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే(1)ను బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్ మొదటి బంతికే కాన్వేను పెవిలియన్ పంపాడు. దాంతో, 16వ సీజన్లో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగాడు. హార్దిక్ వేసిన తొలి ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. దాంతో, 11 పరుగులు వచ్చాయి. డెవాన్ కాన్వే(1), రుతురాజ్(11) క్రీజులో ఉన్నారు. రెండు ఓవర్లకు సీఎస్కే 13 రన్స్ చేసింది. షమీ వేసిన తొలి ఓవర్లో కేవలం రెండు పరుగులు వచ్చాయంతే.
ఐపీఎల్ ఆరంభ పోరులో టాస్ ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్ల తుది ఆటగాళ్ల జాబితా ఇది.
సీఎస్కే తుది జట్టు : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మోయిన్ అలీ, శివం దూబే, ఎం.ఎస్.ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, రాజవర్ధన్ హంగర్‌గెకర్.
గుజరాత్ టైటన్స్ తుది జట్టు : వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, షమీ, జోషు లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్.
ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తొలి పోరులో మొదట బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ రెఫరీగా జవగల్ శ్రీనాథ్ వ్యవహరించనున్నాడు. ఈ స్టేడియంలో జరిగిన ఏడు టీ20 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండు సార్లు, ఛేజింగ్ చేసిన టీమ్ ఐదు సార్లు విజయం సాధించింది.
మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్కు వెళ్లనున్నారు. ధోనీ, పాండ్యా పేర్లను హోస్ట్ మందిరా బేడీ ప్రస్తావించగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, సెక్రటరీ జై షా, సభ్యుడు రాజీవ్ శుక్లా ఆరంభ వేడుకలకు హాజరయ్యారు.
ఐపీఎల్ 16 ఆరంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సింగర్ అర్జిత్ సింగ్ తన టీమ్‌తో కలిసి బాలీవుడ్ పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆ తర్వాత మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా, ఇండియా క్రష్ రష్మిక మందన్న డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు.