Gujarat Titans : ఈ నెలాఖరున పదహారో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలుకానుంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans) జట్టు లో కొత్త జెర్సీ(new jersey)తో బరిలోకి దిగనుంది. ఆ జట్టు న్యూ జెర్సీని ఫ్రాంఛైజీ ఈ రోజు విడుదల చేసింది. దీని స్పెషల్ ఎంటంటే.. ఫ్రాంఛైజీ లోగో మీద స్టార్ గుర్తు ఉంది. కొత్త జెర్సీ ఫొటోలను గుజరాత్ టైటన్స్ యాజమాన్యం ట్విట్టర్లో పెట్టింది.
‘మా జెర్సీ మీద నక్షత్రం గుర్తు ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. అందరూ ఎంతో ఇష్టపడే జెర్సీ కొత్త లుక్, విజయపరంపరను కొనసాగించే లక్ష్యంతో మళ్లీ మీ ముందుకు వచ్చింది’ అని క్యాప్షన్ రాసింది. గత సీజన్ విజేత అయిన గుజరాత్ టైటన్స్ ఈసారి కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగనుంది.
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో గత ఏడాది గుజరాత్ టైటన్స్ ఆరంగేట్రంలోనే ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపొందింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాండ్యా జట్టును గెలిపించాడు. పదహారో సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
#NowPlaying ⚡️⚡️
Dedications for #PapaPandya, #AavaDe | #TATAIPL2023 pic.twitter.com/nSR4j0IA8y
— Gujarat Titans (@gujarat_titans) March 9, 2023