న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభానికి ముందే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జేసన్ రాయ్ ప్రకటించాడు. బయోబబుల్ ఒత్తిడి కారణంగా టోర్నీ నుంచి దూరమవుతున్నట్లు తెలిపాడు. కొద్ది నెలల్లో బిజీ షెడ్యూల్ ఉన్న దృష్ట్యా కుటుంబంతో గడిపేందుకు ఇదే సరైన సమయంగా భావించి ఐపీఎల్ నుంచి విరామం తీసుకున్నాడు. గత సీజన్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తరఫున ఆడిన రాయ్‌ను ఇటీవల మెగావేలంలో టైటాన్స్ కనీస ధర రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. చాలాకాలంగా బయోబబుల్‌లో గడుపుతుండడంతోపాటు జనవరిలో కొడుకు పుట్టడంతో కుటుంబంతో గడిపేందుకు ఈ లీగ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఐపీఎల్ నుంచి రాయ్ ఇలా అర్ధాంతరంగా వైదొలుగడం ఇది రెండోసారి.