హైదరాబాద్: గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma)కు జరిమానా వేశారు. అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఓ డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలోకి వెళ్లింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో .. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఇషాంత్ శర్మ ఉల్లంఘించినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై ఐపీఎల్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
ఐపీఎల్‌లోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘించిన లెవల్ 1 అఫెన్స్‌కు ఇషాంత్ పాల్పడినట్లు తెలిపారు. క్రికెట్ సామాగ్రిని, కానీ దుస్తుల్ని కానీ, గ్రౌండ్ ఈక్విప్మెంట్ పట్ల కానీ అమర్యాదరకంగా ప్రవర్తిస్తే, అప్పుడు ఆర్టికల్ 2.2 కింద జరిమానా విధిస్తారు. అయితే లెవల్ 1 నేరాన్ని ఇషాంత్ అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఫైన్‌ను ఆమోదించాడు.
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నెగ్గినా.. ఆ మ్యాచ్‌లో ఇషాంత్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లలో 53 పరుగులు ఇచ్చేశాడు. 13 ఓవర్ల తర్వాత ఫీల్డింగ్‌లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ మైదానంలోకి దిగాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇషాంత్ ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు ఇచ్చాడు. అతను మూడు మ్యాచుల్లో 8 ఓవర్లు వేసి 107 రన్స్ సమర్పించాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు.