BCCI : శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో కంగుతింటున్న భారత ఏ జట్టు స్క్వాడ్‌లోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయపడిన యువ పేసర్ యుధ్వీర్ సింగ్(Yudhvir Singh) స్థానంలో అశోక్ శర్మ(Ashok Sharma) ఎంపికయ్యాడు. ఐపీఎల్ 19వ సీజన్లో అరంగేట్రం చేసిన అశోక్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా తదుపరి మ్యాచుల్లో యుధ్వీర్ బదులు ఈ పొడగరి పేసర్ స్క్వాడ్‌లో కొనసాగుతాడని మంగళవారం బీసీసీఐ వెల్లడించింది.
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత ఏ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. అఫ్గనిస్థాన్, శ్రీలంక చేతిలో పరాజయం పాలైన టీమిండియా స్క్వాడ్‌లో కీలక మార్పు చేశారు సెలెక్టర్లు. పేసర్ యుధ్వీర్ సింగ్ స్థానంలో అశోక్ శర్మను ఎంపిక చేశారు.
🚨 News 🚨
Ashok Sharma added to India A squad for tri-series in Sri Lanka as a replacement for Yudhvir Singh.
More Details ▶️ https://t.co/Hvc2KSoBlv #TriNationSeries pic.twitter.com/jcZMZ0DDm8
— BCCI (@BCCI) June 16, 2026
గత వారంలో రెండు సార్లు(జూన్ 11, జూన్ 13న) కుడి భుజం అసౌకర్యంగా అనిపిస్తోందని యుధ్వీర్ చెప్పడంతో బీసీసీఐ వైద్యులు అతడిని పరీక్షించారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కొన్నిరోజులు రిహాబిలిటేషన్‌లో ఉండాలని సూచించారు. దాంతో, యుధ్వీర్ స్థానంలో అశోక్ శర్మను ఎంపిక చేయాల్సి వచ్చిందని బీసీసీఐ వెల్లడించింది.
గత కొన్ని నెలలుగా అశోక్ శర్మ గొప్పగా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో అత్యధిక వికెట్లు తీసిన అశోక్ ఐపీఎల్ 19వ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తరఫున అరంగేట్రం చేశాడు. ఆరు మ్యాచులు ఆడిన ఈ పొడగరి పేసర్ గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి వార్తల్లో నిలిచాడు.