Yash Dayal : ఐపీఎల్ 16వ సీజన్లో రింకూ సింగ్(Rinku Singh) ధాటికి బలైంది ఎవరంటే..? అందరికీ మొదట గుర్తుకొచ్చే పేరు యశ్ దయాల్(Yash Dayal ). అవును ఒకే ఓవర్లో అతను 5 సిక్స్‌లు సమర్పించుకొన్నాడు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు చెందిన ఈ యువ పేసర్ ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. కారణం ఏంటంటే..? అతడి ఇన్‌స్టా స్టోరీలో లవ్ జిహాద్(love Jihad) పోస్ట్ ఉంది. అది గమనించిన ఫ్యాన్స్ మనోడిని ఉతికారేశారు. దాంతో యశ్ దయాల్ అందరికీ క్షమాపణలు చెప్పాడు. వెంటనే ఆ పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీ నుంచి తొలగించాడు.
‘ఈరోజు నా ఇన్‌స్టాలో రెండు స్టోరీలు పోస్ట్ అయ్యాయి. అయితే.. ఆ రెండింటినీ నేను పోస్ట్ చేయలేదు. ఎవరో ఒకరు నా అకౌంట్‌ను హ్యాక్ చేసి వాటిని పెట్టారు. ఈ విషయాన్ని అధికారులకు తెలిజేశాను. నా అకౌంట్‌ను తిరిగి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. లవ్ జిహాద్(love Jihad) పోస్టు విషయమై అందరూ నన్ను క్షమించండి. దయచేసి విద్వేషాన్ని వ్యాప్తి చేయకుండి. సమాజంలోని ప్రతి మతం పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు’ అని యశ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన యశ్ రెండు వికెట్లు తీశాడంతే.
పదహారో సీజన్‌ను ఎంతో ఉత్సాహంగా మొదలెట్టిన యశ్ దయాల్.. ఒక్క మ్యాచ్‌తో జీరో అయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను అతను జీవితంలో మర్చిపోలేడు. అవును.. ఆ రోజ ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ ఊచకోతకు అతను బలయ్యాడు. 20వ ఓవర్ వేసిన అతను రింకూను నిలువరించలేకపోయాడు. అప్పటికే జోరుమీదున్న రింకూ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు బాదాడు. దాంతో, కోల్‌కతా తేడాతో గెలిచింది. ఆ క్షణం యశ్ తన ముఖం ఎవరికీ చూపించలేకపోయాడు. అంతేకాదు ఆ తర్వాత నాలుగైదు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. 16వ సీజన్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ల తేడాతో గెలుపొందింది. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో జడేజా(11 నాటౌట్) చివరి రెండు బంతులకు సిక్స్, ఫోర్ కొట్టాడు. దాంతో, చెన్నై ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
యశ్ దయాల్ – రింకూ సింగ్