IPL 2025 : సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్(45), శుభ్‌మన్ గిల్(36)లు దంచికొడుతున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఉతికేస్తూ స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు. వీళ్లిద్దరూ పోటాపోటీగా ఆడుతుండడంతో గుజరాత్ జట్టు పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 82 రన్స్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కు తొలి ఆరు ఓవర్లలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇంతకుముందు 78-0 అత్యుత్తమంగా ఉండేది.
టాస్ ఓడిన గుజరాత్‌కు ఎప్పటిలాగనే ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. షమీ వేసిన తొలి ఓవర్లో శుభ్‌మన్ గిల్ () సిక్సర్ బాదాడు. ఆ తర్వాత ఉనాద్కాట్ మాత్రం 5 పరుగులే ఇచ్చాడు. దాంతో, షమీ వేసిన మూడో ఓవర్లో రెచ్చిపోయిన సాయి సుదర్శన్(45) తొలి బంతిని బౌండరీకి పంపాడు. చివరి నాలుగు బంతుల్ని ఫోర్లుగా మలిచి 20 రన్స్ పిండుకున్నాడు.
𝗨𝗻𝘀𝘁𝗼𝗽𝗽𝗮𝗯𝗹𝗲 𝗦𝗮𝗶 🙅♂
Fastest to 1️⃣5️⃣0️⃣0️⃣ #TATAIPL runs ✅
Sai Sudharsan goes back after a breathtaking 48(23) 👏
Updates ▶ https://t.co/u5fH4jQrSI#GTvSRH pic.twitter.com/kAOaK1eq3L
— IndianPremierLeague (@IPL) May 2, 2025
అనంతరం కమిన్స్‌కు చుక్కలు చూపిస్తూ గిల్ 4, 4, 6 బాదగా గుజరాత్ స్కోర్ 50 దాటింది. హర్షల్ పటేల్‌ను ఉతికేస్తూ సాయి 4 ఫోర్లతో 18 రన్స్ సాధించి అర్ధ శతకానికి చేరువయ్యాడు. తద్వారా ఐపీఎల్లో 1500 మార్క్ అందుకున్నాడీ చిచ్చరపిడుగు.