IPL 2025 : భారీ ఛేదనలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) వికెట్ కీపర్ జోస్ బట్లర్(42) దంచేస్తున్నాడు. ఓపెనర్లు డగౌట్ చేరినా తనదైన షాట్లతో విరుచుకుపడుతున్నాడు. సాయి సుదర్శన్(36)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం షెర్ఫనే రూథర్‌ఫర్డ్(8)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడీ హిట్టర్. గురజరాత్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 110 పరుగులు కావాలి.
ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల ఛేదనలో గుజరాత్‌కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్(7)ను కరుణ్ నాయర్ రనౌట్ చేశాడు. దాంతో, 14 పరుగులకే తొలి వికెట్ పడింది. ఆ తర్వాత సాయి సుదర్శన్(36) అండగా జోస్ బట్లర్(42) ఢిల్లీ బౌలర్లను ఉతికేశాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 60 రన్స్ జోడించి గుజరాత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. డేంజరస్ సుదర్శన్‌ను ఔట్ చేసి ఢిల్లీకి రెండో వికెట్ అందించాడు.
Innings Break! #GT bowlers apply brakes towards the end but #DC manage to put 2️⃣0️⃣3️⃣ on the board! 👊
Who’ll get a win today and grab the 🔝 spot?
Updates ▶️ https://t.co/skzhhRWvEt#TATAIPL | #GTvDC | @gujarat_titans | @DelhiCapitals pic.twitter.com/VKPbib9blL
— IndianPremierLeague (@IPL) April 19, 2025
అహ్మదాబాద్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఢిల్లీ బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కారు. అక్షర్ పటేల్(33) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా ఓపెనర్ కరుణ్ నాయర్(31) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రసిద్ కృష్ణ(4-41) హడలెత్తించినా.. ఆఖర్లో ఫినిషర్ అశుతోష్ శర్మ(37) సిక్సర్ల మోతతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. దాంతో, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఇప్పటివరకూ 198 రన్స్‌ను మాత్రమే ఛేదించిన గుజరాత్ ఈసారి రికార్డు సృష్టిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.